అన్వేషించండి

Samsung Frame TV: టీవీ కొంటే ఫోన్లు ఫ్రీ - శాంసంగ్ కొత్త టీవీలపై బంపర్ ఆఫర్!

శాంసంగ్ ఫ్రేమ్ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయ్యాయి.

శాంసంగ్ తన ఫ్రేమ్ టీవీ సిరీస్‌ను మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి ఇప్పటికే గ్లోబల్ లాంచ్ అయ్యాయి. 43 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు వేర్వేరు సైజుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కేవలం టీవీలా మాత్రమే కాకుండా ఆర్ట్ పీసెస్‌లా ఈ టీవీని ఉపయోగించవచ్చు.

శాంసంగ్ ద ఫ్రేమ్ ధర
ఇందులో 43 అంగుళాల వేరియంట్ ధర మనదేశంలో రూ.61,990 నుంచి ప్రారంభం కానుంది. 50 అంగుళాల వేరియంట్ ధర రూ.73,990గానూ, 55 అంగుళాల వేరియంట్ ధర రూ.91,990 గానూ, 65 అంగుళాల వేరియంట్ ధర రూ.1,27,990 గానూ, 75 అంగుళాల వేరియంట్ ధర రూ.2,99,990 గానూ నిర్ణయించారు. ఈ టీవీ అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్లలో వీటి సేల్ ప్రారంభం కానుంది.

శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, శాంసంగ్ షాప్‌ల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. రూ.7,690 విలువైన బెజెల్‌ను దీంతోపాటు ఉచితంగా అందించనున్నారు. 75 అంగుళాల మోడల్‌ను కొనుగోలు చేస్తే శాంసంగ్ గెలాక్సీ ఏ32, 65 అంగుళాల మోడల్ కొనుగోలు చేస్తే గెలాక్సీ ఏ03 స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పొందవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లను కూడా అందించారు.

శాంసంగ్ ద ఫ్రేమ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 100 హెర్ట్జ్ కాగా, స్క్రీన్‌పై రిఫ్లెక్షన్‌ను కూడా ఇది ఎలిమినేట్ చేయనుంది. శాంసంగ్ క్వాంటం ప్రాసెసర్ 4కేపై ఈ టీవీ పనిచేయనుంది. హెచ్‌డీఆర్10+ అడాప్టివ్, హెచ్‌డీఆర్10+ గేమింగ్ సర్టిఫికేషన్‌ను ఇది పొందింది.

ఈ ఫ్రేమ్ టీవీలో 40W 2.0.2 చానెల్ స్పీకర్లను అందించారు. డాల్బీ అట్మాస్, అడాప్టివ్ సౌండ్ ప్లస్, డాల్బీ డిజిటల్ ప్లస్ ఎంఎస్12 5.1 చానెల్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. శాంసంగ్ టైజెన్ ఓఎస్‌పై ఈ టీవీ పని చేయనుంది. బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్, బిక్స్‌బీ, అలెక్సాలకు సపోర్ట్‌ను ఈ టీవీలో అందించారు.

ఈ టీవీలో ఆర్ట్ మోడ్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా ఆన్‌లో లేనప్పుడు పెయింటింగ్‌లా ఉపయోగించుకోవచ్చు. స్క్రీన్ మీద ఏ ఆర్ట్ ఫాం కనిపించాలో కూడా సెలక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. దాదాపు 1,600కు పైగా ఆర్ట్ వర్క్‌లను ఈ టీవీపై స్క్రీన్ సేవర్లుగా ఉపయోగించుకోవచ్చు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Samsung India (@samsungindia)

టాప్ హెడ్ లైన్స్

Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YS Jagan Unanimous Elections Stand: అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YS Jagan Unanimous Elections Stand: అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Fact Check: రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
ఇరాన్-అమెరికా యుద్ధం: 2026లో పాలన మార్పు? 4 నెలల్లో ఏం జరగబోతోంది?
ఇరాన్-అమెరికా యుద్ధం: 2026లో పాలన మార్పు? 4 నెలల్లో ఏం జరగబోతోంది?
Embed widget