అన్వేషించండి

Apple New CEO : టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్.. యాపిల్ సీఈఓ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా?

Apple New CEO John Ternus : పదిహేనేళ్ల తర్వాత యాపిల్ సీఈఓ పదవి నుంచి టిమ్ కుక్ వైదొలగనున్నారు. జాన్ టెర్నస్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్​గా నియమితులయ్యారు. మరి అతని నెట్ వర్త్ ఎంతో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టిమ్ కుక్ సెప్టెంబర్ 1 నుండి ఆపిల్ సీఈఓ పదవి నుంచి వైదొలగుతారు.
  • హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ VP జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు.
  • టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు, నాయకత్వ మార్పుకు సహకరిస్తారు.
  • కమ్యూనికేషన్ మరియు నాయకత్వంలో కుక్ 15 ఏళ్లలో ఆపిల్‌ను అభివృద్ధి చేశారు.

Apple New CEO Name : ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ 15 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 1న పదవి నుంచి వైదొలగనుండగా.. జాన్ టెర్నస్ సీఈఓగా ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో ఈ టెక్నాలజీ దిగ్గజానికి సారథ్యం వహించిన టిమ్​ కుక్ 15 ఏళ్ల పదవీకాలం ముగియనుంది. సెప్టెంబర్ 1న చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం కుక్ ఆపిల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవిలోకి మారనున్నారని కంపెనీ వెల్లడించింది.

హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్​గా చేస్తోన్న జాన్ టర్నెస్​ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. 2001లో యాపిల్​లో చేరిన టర్నెస్​కు సుదీర్ఘ అనుభవం ఉంది. మొత్తానికి ఆయన ఆపిల్‌లో దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. యాపిల్​కు సంబంధించిన అనేక ప్రధాన ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

ఆరోగ్య కారణాల వల్ల సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ రాజీనామా చేసిన తర్వాత 2011లో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన కుక్.. వేసవి కాలం మొత్తం సీఈఓ పదవిలో కొనసాగుతారు. ఈ కాలంలో నాయకత్వ మార్పు సజావుగా జరిగేలా చూసేందుకు ఆయన టెర్నస్‌తో కలిసి పనిచేస్తారు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా.. ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలతో సంప్రదించడంతో సహా.. కుక్ కంపెనీకి తన సహకారాన్ని కొనసాగిస్తారని భావిస్తున్నారు.

కుక్ నాయకత్వంలో, ఆపిల్ అనేక చారిత్రాత్మక మైలురాళ్లను చేరుకుంది. 2018లో 1 ట్రిలియన్ డాలర్ల (740 బిలియన్ పౌండ్ల) మార్కెట్ విలువను సాధించిన మొట్టమొదటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

టిమ్ కుక్ శాలరీ.. 

2023లో టిమ్ కుక్ కంపెనీ నుంచి $63.2 మిలియన్లు (భారత కరెన్సీలో 544 కోట్లు) అందుకున్నారు. 18 శాతం పెరుగుదలతో.. 2024లో ఆ మొత్తం $74.6 మిలియన్లకు (భారత కరెన్సీలో 643 కోట్లు) చేరుతుంది. అంటే ఒక సంవత్సరంలో టిమ్ కుక్ జీతం 99 కోట్లు పెరిగింది. టిమ్ కుక్ ఆపిల్ నుంచి 3 మిలియన్ డాలర్ల ప్రాథమిక జీతం అందుకున్నారు. ఆయనకు 58 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డులు లభించాయి. బోనస్‌ల రూపంలో ఆయనకు 12 మిలియన్ డాలర్లు అందాయి.

దీనికి అదనంగా టిమ్ కుక్ పదవీ విరమణ ప్రయోజనాలు, బీమా, సెలవులు, భద్రత, విమాన ప్రయాణ ఖర్చుల కోసం మరో 1.5 మిలియన్ డాలర్లు అందుకున్నారు. వ్యాపార లేదా వ్యక్తిగత ప్రయాణాలకైనా, టిమ్ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తారు.

జాన్ టెర్నస్ శాలరీ..

జాన్ టెర్నస్ నెట్‌వర్త్ గురించి ఇప్పటివరకు ఎలాంటి పబ్లిక్ డేటా లేదు. అయితే ఆపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ఆయనకు భారీ స్థాయిలో మంచి శాలరీ వస్తుంది. బోనస్, స్టాక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు వార్షిక జీతం కోట్లలో ఉంటుంది. స్టాక్ బెనిఫిట్స్​తో పాటు పనికి తగిన బోనస్‌లు ఉంటాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget