Thomson R9 LED TV: రూ.9 వేలలోపే ఎల్ఈడీ టీవీ.. కంప్యూటర్ మానిటర్‌లానూ వాడుకోవచ్చు!
ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ ఆర్9 ఎల్ఈడీ టీవీపై భారీ ఆఫర్ అందించారు.
ఫ్లిప్‌కార్ట్‌లో మరి కాసేపట్లో బిగ్ బచత్ ధమాల్ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో థామ్సన్ ఆర్9 24 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీపై సూపర్ ఆఫర్ అందించారు. రూ.10,499 విలువైన ఈ టీవీని రూ.8,499కే కొనుగోలు చేయవచ్చు.
ఈ టీవీలో 24 అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్‌గా ఉంది. సౌండ్ అవుట్‌పుట్ 20Wగా ఉండటం విశేషం. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఈ టీవీలో జీరో డాట్ ఏ+ గ్రేడ్ ప్యానెల్‌ను అందించారు.
థామ్సన్ ఆర్9 టీవీ 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ను అందించనుంది. ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. దీని పీక్ బ్రైట్‌నెస్ 300 నిట్స్‌గా ఉంది. హెచ్‌డీఎంఐ పోర్టు ద్వారా దీన్ని కంప్యూటర్ మానిటర్‌లా కూడా వాడుకునే అవకాశం ఉంది.
దీని బరువు కేవలం 3.5 కేజీలు మాత్రమే. ఒక సంవత్సరం వారంటీని దీనిపై కంపెనీ అందించింది. ఇది స్మార్ట్ టీవీ కాదు కాబట్టి.. దీనికి కంపెనీ ఇన్‌స్టాలేషన్‌ను అందించడం లేదు. 24 అంగుళాల టీవీల్లో మనదేశంలో బెస్ట్ సౌండ్ అవుట్‌పుట్ అందించే టీవీ ఇదేనని కంపెనీ అంటోంది.
ఈ టీవీని ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. రూ.295 నుంచి దీని ఈఎంఐలు ప్రారంభం కానున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులను ఉపయోగించి ఈ టీవీని నెలసరి వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. టీవీతో పాటు వర్క్ స్టేషన్‌లా కూడా కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.
View this post on Instagram