అన్వేషించండి

Redmi Turbo 3: 1000 జీబీ స్టోరేజ్‌తో బడ్జెట్ ఫోన్ లాంచ్ - రెడ్‌మీ టర్బో 3 వచ్చేసింది!

Redmi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్. ఇందులో 1 టీబీ వరకు స్టోరేజ్‌ను కంపెనీ అందించింది.

Redmi Turbo 3 Launched: రెడ్‌మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 12 టర్బోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెస్ 3 ప్రాసెసర్‌పై రెడ్‌మీ టర్బో 3 రన్ కానుంది. షావోమీ ఇటీవలే లాంచ్ చేసిన హైపర్ఓఎస్ ఇంటర్‌ఫేస్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 1.5కే రిజల్యూషన్ ఉన్న ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు రెడ్‌మీ టర్బో 3 హ్యారీ పోటర్ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

రెడ్‌మీ టర్బో 3 ధర (Redmi Turbo 3 Price)
రెడ్‌మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.23,000) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.26,450) ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.28,000), టాప్ ఎండ్ మోడల్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.32,000) నిర్ణయించారు. ఐస్ టైటానియం, గ్రీన్ బ్లేడ్, మో జింగ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది

రెడ్‌మీ టర్బో 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Redmi Turbo 3 Specifications)
షావోమీ హైపర్ఓఎస్ ఇంటర్‌ఫేస్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 1.5కే కాగా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 4ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై రెడ్‌మీ టర్బో 3 రన్ కానుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్‌ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను కూడా రెడ్‌మీ టర్బో 3 సపోర్ట్ చేయనుంది. వెనకవైపు మరో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బైదు, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ రిమోట్ కంట్రోల్, అల్ట్రా సోనిక్ డిస్టెన్స్ సెన్సార్, ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్ సెన్సార్లను కూడా కంపెనీ ఇందులో అందించింది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ల ద్వారా రెడ్‌మీ టర్బో 3ని అన్‌లాక్ చేయవచ్చు. డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్‌లో చూడవచ్చు. ఐపీ64 డస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ బిల్డ్‌‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.

రెడ్‌మీ టర్బో 3 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 13 గంటల పాటు షార్ట్ వీడియోలను చూడవచ్చని కంపెనీ అంటోంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
AI Chatbots: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
Wired vs Wireless Internet: వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget