అన్వేషించండి

Realme GT Neo 6 SE: ప్రపంచంలోనే మొదటిసారి అలాంటి డిస్‌ప్లేతో ఫోన్ - రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ లాంచ్!

Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT Neo 6 SE Launched: రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. నియో సిరీస్‌లో లాంచ్ అయిన మిడ్ రేంజ్ ఫోన్ ఇదే. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ ఇందులో అందించడం విశేషం. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది.

రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ ధర (Realme GT Neo 6 SE Price)
ఈ ఫోన్ ఏకంగా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,699 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.18,000) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,899 యువాన్లుగానూ, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,099 యువాన్లుగానూ నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా ఉంది.

రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. చైనాలో దీనికి సంబంధించిన సేల్ ఏప్రిల్ 17వ తేదీ నుంచి జరగనుంది. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ స్పెసిఫికేషన్లు (Realme GT Neo 6 SE Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే 8టీ ఎల్టీపీవో డిస్‌‌ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 6000 నిట్స్‌గా ఉండటం విశేషం. గేమింగ్‌కు సపోర్ట్ చేసే ప్రత్యేకమైన డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించినట్లు రియల్‌మీ తెలిపింది. ప్రపంచంలోనే ఈ డిస్‌ప్లేతో లాంచ్ మొదటి స్మార్ట్ ఫోన్ ఇదేనట. అలాగే 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్న మొదటి ఫోన్ కూడా ఇదేనని కంపెనీ అంటోంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ జీటీ నియో 6 రన్ కానుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. గేమింగ్ కోసం ఇందులో ప్రత్యేకంగా 3డీ కూలింగ్ సిస్టం అందుబాటులో ఉండటం విశేషం.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.

5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.4, బైదు, జీపీఎస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. జియో మ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్, అండర్ స్క్రీన్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరేషన్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, గైరో స్కోప్‌లను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 191 గ్రాములుగా ఉంది.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget