అన్వేషించండి

Realme C67 5G: రూ.14 వేలలోపే 5జీ ఫోన్ - రియల్‌మీ సీ67 5జీ ధర, ఫీచర్లు ఇవే!

Realme Cheapest 5G Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది.

Realme Affordable 5G Phone: రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. రియల్‌మీ సీ-సిరీస్‌లో లాంచ్ అయిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో ఇది మార్కెట్లోకి రానుంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. దీనికి సంబంధించిన 4జీ వెర్షన్ కూడా త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

రియల్‌మీ సీ67 5జీ ధర
ఈ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. డార్క్ పర్పుల్, సన్నీ ఒయాసిస్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ సేల్ డిసెంబర్ 16వ తేదీ నుంచి జరగనుంది. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. డిసెంబర్ 20వ తేదీ లోపు కొనుగోలు చేస్తే రూ.2,000, ఆ తర్వాత కొనుగోలు చేస్తే రూ.1,5000 ఆఫర్లు లభించనున్నాయి. అయితే దీనికి మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఉండాలి.

రియల్‌మీ సీ67 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ లెవల్ 680 నిట్స్‌గా ఉంది. సన్నీ ఒయాసిస్ డిజైన్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. సన్‌లైట్‌లో దీని బ్యాక్ ప్యానెల్ షైన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ సీ67 5జీ పని చేయనుంది. ఇందులో మినీ క్యాప్సూల్ ఫీచర్ కూడా అందించారు. ఐఫోన్లలో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఇది పని చేస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై రియల్‌మీ సీ67 5జీ రన్ కానుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 6 జీబీ పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. కేవలం 29 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది. ఐపీ54 రేటింగ్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్ అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget