Realme Smartphones: రియల్ మీ నుంచి రెండు సరి కొత్త ఫోన్లు - ఫీచర్స్ తెలిస్తే అవాక్కే!
Realme 13 5G series | రియల్‌మీ అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త మోడల్ ఫోన్స్ 13 5జీ, రియల్‌మీ 13+ 5జీ రెండు ఫోన్లను లాంఛ్ చేసింది. 80W ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 14 సపోర్ట్ ఉంది.
Realme 13 5G series Mobiles Price Specifications - ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త మోడల్ ఫోన్లను యూజర్స్ కోసం మార్కెట్లలోకి రిలీజ్ చేస్తుంటుంది. తాజాగా 15 5జీ సిరీస్‌లో రెండు సరి కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లోకి విడుదల చేసి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. రియల్‌మీ 13 5జీ, రియల్‌మీ 13+ 5జీ పేరిట రెండు ఫోన్లను లాంఛ్ చేసింది. ఆకర్షణీయమైన స్టైలిష్ డిజైన్‌తో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వీటిని ఆవిష్కరించి ఆకట్టుకుంది. ఆండ్రాయిడ్ 14 సపోర్ట్‌తో రియల్ మీ యూఐతో వచ్చిన ఈ మొబైల్ ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్‌మీ 13 5 జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ డిస్ ప్లే 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + ఎల్‌సీడీతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 580 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తోంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లో 6 ఎమ్‌ఎమ్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌తో నడుస్తుంది. 5,000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ దీని సామర్థ్యం.
రెండు వేరియంట్లలో అందుబాటులోకి
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సల్ డ్యుయెల్ రియర్ కెమెరా, శాంసంగ్ S5KJNS మెయిన్ సెన్సర్‌తో వస్తోంది. 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను కూడా అమర్చారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో యూజర్స్‌కు అందుబాటులో ఉంచారు. 8జీబీ + 128జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. దీని ధర రూ.17,999గా కంపెనీ ప్రకటించింది. 8జీబీ + 256 జీబీ వేరియంట్ ధరను రూ.19,999గా తెలిపింది. డార్క్ పర్పల్, స్పీడ్ గ్రాన్ రంగుల్లోనూ కూడా ఇది మార్కెట్లో లభిస్తోంది.
రియల్‌మీ 13 మొబైల్స్ ధరలు
ఇక పోతే రియల్‌మీ 13 5 జీలో ఉన్న బ్యాటరీ, కెమెరా ఫీచర్లే రియల్ మీ 13 + 5జీ స్మార్ట్ ఫోన్‌లోనూ ఉండటం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను వస్తోంది. 120 Hz రిఫ్రెష్ రేటు, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 4 ఎమ్‌ఎమ్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్‌తో నడుస్తోంది. తడి చేత్తోనూ ఫోన్‌ను వాడేందుకు వీలుగా అనుకూలంగా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌తో ఇది నడుస్తుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. 8జీబీ + 128జీబీ స్టోరేజ్ కెపాసిటీని సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.22,999గా కంపెనీ ప్రకటించింది. 8జీబీ + 256జీబీ వేరియంట్ ధరను రూ.24,999గా, 12జీబీ + 256జీబీ వేరియంట్ ధరను రూ.26,999గా సదరు కంపెనీ తెలిపింది. స్పీడ్ గ్రాన్, డార్క్ పర్పల్, విక్టరీ గోల్డ్ కలర్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.
మొత్తంగా ఈ రెండు కొత్త ఫోన్లు ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఇప్పటికే మొదలైపోయ్యాయి. యూజర్స్ బుక్ చేసుకోవడం ప్రారంభించేశారు. ముందుగా బుక్ చేసుకోవాలనుకునే వారు రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో బుక్ చేసుకునే వీలును కల్పించింది రియల్ మీ. ప్రీ బుకింగ్ ఆర్డర్లకు ఆరు నెలల పాటు ఉచితంగా స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ కూడా పొందేలా వెసులుబాటును కల్పిస్తోంది.
Also Read: Iphone 16: ఆ స్పెషల్ డేనే ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్! - ఆ రోజు ఇంకా ఏమేం రాబోతున్నాయంటే?