pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!
ఆడియో బ్రాండ్ పీట్రాన్ మనదేశంలో కొత్త నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది.
పీట్రాన్ మనదేశంలో కొత్త నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్ చేసింది. అవే ట్యాంగెంట్ డ్యుయో. చాలా తక్కువ ధరతో ఇవి మార్కెట్లో లాంచ్ అయ్యాయి. 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇవి అందించనున్నాయి. ఏఏసీ బ్లూటూత్ కోడెక్‌ను ఇది సపోరట్్ చేయనుంది.
పీట్రాన్ ట్యాంగెంట్ డ్యుయో ధర
దీని ధరను రూ.499గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ అమెజాన్‌లో ఇప్పటికే ప్రారంభం అయింది. ఫేవ్ బ్లాక్, గ్రే, ఓషన్ గ్రీన్, మ్యాజిక్ బ్లూ రంగుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరకే వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
పీట్రాన్ ట్యాంగెంట్ డ్యుయో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
13 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు ఇందులో అందించారు. కాబట్టి ఇవి ఎక్కువ సౌండ్‌ను అందించే అవకాశం ఉంది. దీంతోపాటు అడ్వాన్స్‌డ్ అకోస్టిక్ ప్లాట్‌ఫాం కూడా ఉంది. ఇవి సరైన బేస్‌ను, తక్కువ డిస్టార్షన్‌ను అందించనున్నాయి. హ్యాండ్స్ ఫ్రీగా మ్యూజిక్ వినడం, కాల్స్ చేసుకోవడం ఇందులో సాధ్యం అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైసెస్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. ఆన్ డివైస్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ కంట్రోల్స్ ద్వారా కాల్స్ తీసుకోవడం, స్మార్ట్ ఫోన్లలో మ్యూజిక్ కంట్రోల్ చేయడం వంటివి చేయవచ్చు.
ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 24 గంటల ప్లే టైం లభించనుంది. టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కేవలం 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే మూడు గంటల ప్లేటైంను ఎంజాయ్ చేయవచ్చు. ఐపీఎక్స్4 రేటింగ్ కూడా ఇందులో ఉంది. నీరు, దుమ్ము నుంచి ఇవి మీ బడ్స్‌ను కాపాడతాయి.
పీట్రాన్ ఇటీవలే మనదేశంలో అత్యంత చవకైన స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. అదే పీట్రాన్ ఫోర్స్ ఎక్స్11. ఈ వాచ్‌లో బ్లూటూత్ 5.0 టెక్నాలజీని కంపెనీ అందించింది. ఓనిక్స్ బ్లాక్, సూడ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ.2,949గా నిర్ణయించారు. ఈ వాచ్‌లో 1.7 అంగుళాల పెద్ద హెచ్‌డీ ఫుల్ టచ్ కలర్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 2.5డీ కర్వ్‌డ్ డయల్‌ను అందించారు. అలోయ్ మెటల్ కేసింగ్ కూడా ఇందులో ఉంది. ఇందులో హెల్త్, వెల్‌నెస్ సెన్సార్లు కూడా ఉన్నాయి. హార్ట్ రేట్, ఇతర బాడీ ఫంక్షన్లను కూడా ఇది ట్రాక్ చేయనుంది.
ఏడు యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాల్స్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా అలెర్ట్స్ కూడా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. వైర్‌లెస్ కాలింగ్ ఫీచర్ కూడా ఈ ఫీచర్‌లో ఉంది. ఇందులో బ్లూటూత్ వీ5.0 ప్రాసెసర్‌ను అందించారు. బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ కూడా ఇందులో ఉంది. మూడు గంటల పాటు చార్జ్ చేస్తే ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను పీట్రాన్ ఎక్స్11 అందించనుంది. ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లకు యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!