ChatGPT New Feature: ఛాట్‌జీపీటీ నుంచి సూపర్ ఫీచర్ - ఇక ఫొటోలను కూడా!
ChatGPT: ఛాట్‌జీపీటీ కొత్త ఫీచర్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఇకపై ఇమేజెస్‌ను కూడా అనలైజ్ చేయవచ్చు. విజన్ రిక్వెస్ట్‌లు, ఫంక్షన్ కాలింగ్‌ని కూడా ఇప్పుడు ఉపయోగించవచ్చు.
OpenAI: ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ తన అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్ జీపీటీ-4 టర్బో కోసం బుధవారం ఒక అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది. ఏఐ మోడల్స్ ఇప్పుడు దృష్టి సామర్థ్యాలను కూడా కలిగి ఉన్నాయి. ఇది మల్టీమీడియా ఇన్‌పుట్‌లను విశ్లేషించడానికి ఛాట్‌జీపీటీని అనుమతిస్తుంది. అంటే ఇప్పుడు ఛాట్‌జీపీటీ ఫొటోలను కూడా అనలైజ్ చేయగలదు. వినియోగదారులకు దాని ఇన్‌సైట్స్‌ను చూపగలదు.
ఛాట్‌జీపీటీ కొత్త ఫీచర్
ఛాట్‌జీపీటీకి వస్తున్న ఈ కొత్త ఫీచర్ ఏపీఐలోని డెవలపర్‌లకు, అలాగే ఛాట్‌జీపీటీ ద్వారా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఓపెన్ఏఐ డెవలపర్లు ఎక్స్ (గతంలో ట్విట్లర్)లో వారి అధికారిక ఖాతా నుంచి ఒక పోస్ట్‌లో జీపీటీ-4 విజన్‌ని ప్రకటించారు. "GPT-4 Turbo with Vision ఇప్పుడు ఏపీఐలో అందుబాటులో ఉంది. విజన్ రిక్వెస్ట్‌లు, జేఎస్ఓఎన్ మోడ్, ఫంక్షన్ కాలింగ్‌ని కూడా ఇప్పుడు ఉపయోగించవచ్చు" అని ఈ పోస్ట్ ద్వారా ప్రకటించారు.
We continue to invest in making our models better and look forward to seeing what you do. If you haven’t tried it yet, GPT-4 Turbo is available in ChatGPT Plus, Team, Enterprise, and the API.
— OpenAI (@OpenAI) April 12, 2024
దృష్టి సామర్థ్యాలతో జీపీటీ-4 టర్బో ఏ ఫొటోను అయినా అనలైజ్ చేయగలదు. దాని గురించి పూర్తి సమాచారాన్ని వినియోగదారులకు అందించగలదు. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో కంపెనీ కొన్ని ఉదాహరణలను కూడా షేర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక బ్రాండ్‌లు దృష్టి సామర్థ్యాలతో అప్‌డేట్ చేసిన ఏపీఐని ఉపయోగిస్తున్నాయి.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
ఈ ఫీచర్ ప్రత్యేక లక్షణాలు ఇవే...
బెంగుళూరుకు చెందిన హెల్తిఫై మీ తన కస్టమర్‌ల కోసం మాక్రోలను సులభంగా ట్రాక్ చేయడానికి దృష్టి సామర్థ్యాలతో అప్‌డేట్ చేసిన ఏపీఐని కూడా ఉపయోగిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు తమ కెమెరాకు తినే ఆహారాన్ని చూపించాలి. దాన్ని ఏఐ మోడల్ మాక్రోలకు తెలియజేసి విశ్లేషిస్తుంది. మీరు ఆహారాన్ని తిన్న తర్వాత నడవాల్సిన అవసరం ఉందా లేదా అని సూచిస్తుంది.
ఛాట్‌జీపీటీ కోసం ప్లస్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఛాట్‌జీపీటీ ప్లస్ అనేది చెల్లింపు సేవ. దీని కోసం వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఛాట్‌జీపీటీ ప్లస్ సేవకు నెలవారీ ఛార్జీ 20 డాలర్లుగా ఉంది. ఛాట్‌జీపీటీ ఈ కొత్త విజన్ ఫీచర్‌ను ప్రారంభించిన తర్వాత వినియోగదారులు ఏదైనా చిత్రాన్ని ఛాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తే, అది ఆ ఫొటోకు సంబంధించిన పూర్తి వివరాలను, దానికి సంబంధించిన ఇన్‌సైట్స్‌ను తెలియజేస్తుంది. ఉదాహరణకు మీరు తాజ్ మహల్ ఫోటోను ఛాట్‌జీపీటీకి పంపితే, అది మీకు తాజ్ మహల్ ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏంటి? ఎప్పుడు నిర్మించారు? దానిని నిర్మించడానికి ఏ రాళ్లను ఉపయోగించారు మొదలైన వాటి గురించి సమాచారాన్ని అందిస్తుంది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది