By: ABP Desam | Updated at : 23 Feb 2022 01:35 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ 10 ప్రో కొత్త కలర్ వేరియంట్ లాంచ్ అయింది. (Image Credits: OnePlus)
వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్‌లో కొత్త కలర్ వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. దీనికి ‘ఫ్యాట్ డబాయ్’ అని కంపెనీ పేరు పెట్టింది. పాండాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యేలా వైట్, బ్లాక్ కలర్లతో ఈ వేరియంట్‌ను కంపెనీ డిజైన్ చేసింది. ఇందులో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ సంవత్సరం జనవరిలో ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో ఇంకా లాంచ్ కాలేదు. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో ధర
వన్‌ప్లస్ 10 ప్రో ఫ్యాట్ డబాయ్ కలర్ వేరియంట్ ధరను చైనాలో 5,799 యువాన్లుగా (సుమారు రూ.68,100) నిర్ణయించారు. ఇది 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఫోన్ వెనకవైపు సెరామిక్ వైట్, కెమెరా భాగంలో మాత్రం బ్లాక్ మాడ్యూల్‌ను అందించారు. ఇది పాండా కలర్ కాంబినేషన్. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
ఇందులో ఇంతకు ముందే ఎమరాల్డ్ ఫారెస్ట్, వొల్కానిక్ బ్లాక్ ఎడిషన్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,699 యువాన్లుగా (సుమారు రూ.54,500) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.58,000), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,299 యువాన్లుగానూ (సుమారు రూ.61,500) ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను వన్‌ప్లస్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కంపెనీ ఇందులో అందించింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో అందించారు. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ను కూడా ఇందులో అందించడం విశేషం.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్‌ను అందించగా, ఈ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, మరో 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ గానూ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరా అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా... 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 200.5 గ్రాములుగా ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
Realme Pad X: రూ.15 వేలలోనే రియల్‌మీ ట్యాబ్లెట్ - భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ - ఎలా ఉందో చూశారా?
iPhone 14 Series: ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్ - చైనా మళ్లీ ముంచేసిందిగా!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ