అన్వేషించండి

Ola electric scooter: ఇవే ఓలా స్కూటర్లు.. సోషల్ మీడియాలో ఫొటోల హల్‌చల్..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ రంగులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల చేస్తున్నాయి. లీక్ అయిన ఫొటోల ద్వారా ఈ స్కూటర్స్ బ్లాక్, పింక్, లైట్ బ్లూ, వైట్ కలర్స్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఓలా సంస్థ త్వరలో విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కలర్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఓలా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కానుందని ప్రకటన వెలువడిన నాటి నుంచి దానికి చెందిన ప్రతీ వార్తా సంచలనంగా మారుతోంది. స్కూటర్ టీజర్ మొదలు అడ్వాన్స్ బుకింగ్స్, ఒక్క రోజులోనే లక్ష బుకింగ్స్ ఇలా ప్రతీది హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ బైకులకు సంబంధించిన ఫొటోలు, పేర్లు, స్పెసిఫికేషన్లు ఇవే అంటూ పలువురు సోషల్ మీడియాలో ఫొటోలను షేరు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. లీక్ అయిన ఫొటోల ద్వారా ఈ స్కూటర్ బ్లాక్, పింక్, లైట్ బ్లూ, వైట్ కలర్స్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. 

Ola electric scooter: ఇవే ఓలా స్కూటర్లు.. సోషల్ మీడియాలో ఫొటోల హల్‌చల్..

ఓలా సీఈవో ట్వీట్‌తో..
ఓలా కలర్స్ కు సంబంధించి సంస్థ సీఈవో భవిష్‌ అగర్వాల్ సైతం ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల కలర్స్ ఈ రోజు ఖరారు చేయబడుతున్నాయని తెలిపారు. నాలుగు ఆప్షన్లను ఇచ్చి మీరైతే ఏ రంగు ప్రిఫర్ చేస్తారు అని యూజర్లను అడిగారు. ఇందులో పాస్టెల్ (Pastel), మెటాలిక్ (Metallic), మ్యాట్ (Matte) లతో పాటు గివ్ మీ ఆల్ (Give me all!!)  అనే నాలుగు ఆప్షన్లను ఇచ్చారు.

పాస్టెల్ విభాగంలో రెడ్, ఎల్లో, బ్లూ.. మెటాలిక్ విభాగంలో సిల్వర్, గోల్డ్, పింక్.. మ్యాట్ విభాగంలో బ్లాక్, బ్లూ, గ్రే రంగులను ఇచ్చారు. ఈ నాలుగు ఆప్షన్లలో అత్యధికంగా గివ్ మీ ఆల్ ఆప్షన్ కు 43.4 శాతం ఓ రాగా, తర్వాతి స్థానాల్లో మ్యాట్ (41 శాతం) పాస్టెల్ (9.8 శాతం), మెటాలిక్ (5.8 శాతం) ఉన్నాయి. 
రికార్డు స్థాయిలో బుకింగ్స్..
ఎలక్ట్రిక్ బైక్స్ కోసం ఎదురుచూసే వారి కోసం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని కోసం అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభించింది. త్వరలో విడుదల చేయబోయే ఈ స్కూటర్‌కు బుకింగ్ ఫీజుగా రూ.499 చెల్లించాలని తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో లక్ష మంది స్కూటర్ కోసం రిజర్వ్‌ చేసుకున్నారని సంస్థ వెల్లడించింది. ఇక ఈ స్కూటర్ల కోసం దేశవ్యాప్తంగా 400 పట్టణాల్లో హైపర్ చార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రకటించింది.

Ola electric scooter: ఇవే ఓలా స్కూటర్లు.. సోషల్ మీడియాలో ఫొటోల హల్‌చల్..

వేరియంట్లు ఇవే!
ఈ స్కూటర్ వేరియంట్ల వివరాలు అధికారికంగా విడుదల చేయనప్పటికీ, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తం మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. లీకుల ప్రకారం.. ఓలా సిరీస్ S, S1, S1 ప్రో అనే మూడు పేర్లతో వేరియంట్లు రాబోతున్నట్లు తెలిసింది. సిరీస్ ఎస్ అనేది అధికారిక పేరు కాగా, ఎస్ 1, ఎస్ 1 ప్రో వేరియంట్లుగా ఉండనున్నాయి. ఎస్ 1ను బేస్ వేరియంట్‌గా, ఎస్ 1 ప్రో టాప్ వేరియంట్‌గా ఉండనుంది. 
ఈ బండిని ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలాగే జీరో శాతంగా ఉన్న స్కూటర్ చార్జింగ్ కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం వరకు చేరుతుంది. ఓలా స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓలా స్కూటర్ ధ‌ర రూ.ల‌క్ష నుంచి రూ. 1.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Embed widget