Nokia C12 Plus: సూపర్ డూపర్ డిస్ ప్లే, 4,000mAh బ్యాటరీ, దేశీయ మార్కెట్లోకి అదిరిపోయే నోకియా స్మార్ట్ ఫోన్
నోకియా కంపెనీ మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో, చక్కటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది.
మధ్యతరగతి స్మార్ట్ ఫోన్లకు పెట్టింది పేరు అయిన నోకియా కంపెనీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నోకియా బ్రాండ్ లైసెన్సీ HMD గ్లోబల్ ద్వారా నోకియా C12 ప్లస్ ను దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్‌గా ఆవిష్కరించింది. ఈ సరికొత్త C12 సిరీస్ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)పై రన్ అవుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల HD+ డిస్ ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ యునిసోక్ SoC ద్వారా రన్ అవుతుంది. నోకియా C12 ప్లస్ 2GB RAM, 32GB ఆన్ బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, 4,000mAh బ్యాటరీ, 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెన్సార్ మోడల్ ను కలిగి ఉంది. HMD గ్లోబల్ జనవరిలో ఎంట్రీ లెవల్ నోకియా C12ని ఆవిష్కరించింది. Nokia C12 Plus లైనప్ లో అత్యంత ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా అందుబాటులోకి వచ్చింది.
భారతదేశంలో నోకియా C12 ప్లస్ ధర, లభ్యత
భారతదేశంలో నోకియా C12 ప్లస్ ధర విషయాన్ని పరిశీలిస్తే, 2GB + 32GB స్టోరేజ్ వేరియంట్ కాస్ట్ రూ. 7,999గా కంపెనీ నిర్ణయించింది. నోకియా ఇండియా అధికారిక వెబ్ సైట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన లభ్యత వివరాలను వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇక నోకియా C12 ధర విషయానికి వస్తే, 2GB + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 5,999గా నిర్ణయించింది. నోకియా C12 ప్రో బేస్ 2GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999 కాగా, 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 7,999గా ఫిక్స్ చేసింది.
నోకియా C12 ప్లస్ స్పెసిఫికేషన్స్
కొత్త నోకియా C12 ప్లస్ ఆండ్రాయిడ్ 12 (Go ఎడిషన్)పై రన్ అవుతుంది. 6.3-అంగుళాల HD+ (720 X 1,520 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్ ను ఉంచడానికి డిస్ ప్లే వాటర్ డ్రాప్ కటౌట్‌ను కలిగి ఉంది. ఫోన్ గరిష్టంగా 1.6Hz క్లాక్ ఫ్రీక్వెన్సీతో ఆక్టా-కోర్ Unisoc SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఈ CPU వేగం SC9863A1తో అనుబంధించబడింది. ఇది 2GB RAMని కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ కోసం, నోకియా C12 ప్లస్ ఆటో ఫోకస్, LED ఫ్లాష్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది 32GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ ను అందిస్తుంది.
నోకియా C12 ప్లస్‌లోని కనెక్టివిటీ విషయాన్ని పరిశీలిస్తే, Wi-Fi 802.11b/g/n, బ్లూటూత్ 5.2, మైక్రో-USB పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. ఇది 4,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Nokia C12, Nokia C12 Proలో ఉన్న 3,000mAh బ్యాటరీతో పోలిస్తే ఇది అప్ గ్రేడ్ గా చెప్పుకోవచ్చు.