అన్వేషించండి

Musk Vs Zuck: రోమ్ నగరంలో మస్క్, మార్క్‌ల ఫైట్ - గవర్నమెంట్‌తో ఆల్రెడీ మాట్లాడేశానంటున్న ఎలాన్!

ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య జరగనున్న కేజ్ ఫైట్ రోమ్ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది.

ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్‌ల మధ్య ఫైట్ రోమ్ నగరం వేదికగా జరగనుంది. రోమ్ నగరంలోని పురాతన సెటప్‌లో ఈ పోరు జరగనుంది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ ఫైట్‌ యూఎఫ్‌సీ ఆధ్వర్యంలో జరగబోదని, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫౌండేషన్లు ఈ పోటీని నిర్వహిస్తాయని కూడా ఎలాన్ మస్క్ తెలిపాడు. కెమెరాలో కనిపించే ప్రతి ఫ్రేమ్ పురాతన రోమ్ తరహాలోనే ఉంటుందని, ఇప్పటిలా ఏమీ ఉండదని పేర్కొన్నాడు. ఈ విషయమై ఇటలీ ప్రధాన మంత్రి, అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చాడు. లొకేషన్ విషయంలో వారి అంగీకారం దొరికినట్లు తెలిపాడు.

ఈ పోరులో జరిగే ప్రస్తుత, ప్రాచీన ఇటలీకి గౌరవప్రదంగా ఉంటుందని ట్వీట్ చేశాడు. మెటా, ఎక్స్ ప్లాట్‌ఫాంల్లో ఈ పోరాటాన్ని లైవ్ ద్వారా చూడవచ్చు. ఫైట్ ద్వారా వచ్చే మొత్తం నగదు అమెరికా మిలటరీ సంస్థ అయిన ‘వెటరన్స్’కు చేరుతుంది.

నిజానికి ఈ పోరు ఇప్పటికే జరగాల్సింది. కానీ ఎలాన్ మస్క్‌కు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఫైట్ ఇప్పటి వరకు జరగలేదు. సాధారణంగా ఎలాన్ మస్క్ దూకుడైన వ్యక్తి. మార్క్ జుకర్‌బర్గ్ కాస్త ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఈ పోరు విషయంలో మాత్రం మార్క్ జుకర్‌బర్గ్ ముందు నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మస్క్ ఎప్పుడంటే అప్పుడు తాను పోరుకు సిద్ధం అని, తాను మస్క్‌కు ఒక డేట్ కూడా ప్రపోజ్ చేశానని, కానీ అతని వైపు నుంచి ఆలస్యం జరుగుతుందని మార్క్ జుకర్‌బర్గ్ గతంలో థ్రెడ్స్‌లో పోస్ట్ చేశారు.

గత జూన్‌లో వరుస సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్‌కు అంగీకరించారు. మొదట్లో దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగినా జూన్ నెలాఖరుకు ఈ పోరాటంపై చర్చ ఆగిపోయింది. మార్క్ జుకర్‌బర్గ్ అయితే పోటీ అసలు జరుగుతుందా లేదా అనే దానిపై అనిశ్చితిని, అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రస్తుతం ట్విటర్‌ని ఎక్స్‌గా రీబ్రాండింగ్‌లో నిమగ్నమై ఉన్న ఎలోన్ మస్క్, కేజ్ ఫైట్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని యూఎస్ వెటెరన్స్ సంస్థకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 

దీని తరువాత ట్విట్టర్ సీఈవో లిండా యాకారినో కూడా ఎలాన్ మస్క్ ట్వీట్‌పై వ్యాఖ్యానించారు. ఈ గొప్ప మ్యాచ్‌ని చూడటానికి తన క్యాలెండర్‌ను క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. మార్క్ జుకర్‌బర్గ్ ఉత్సాహంతో, శస్త్రచికిత్స గురించి మస్క్ చేసిన ఇటీవలి ప్రకటనలతో జరగబోయే పోరాటంపై ఇరుపక్షాలు సమానంగా ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది. అయితే ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?

Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget