అన్వేషించండి

Motorola Edge S30: 108 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్ వంటి ఫీచర్లు.. ధర రూ.24 వేలలోపే!

మోటొరోలా కొత్త స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ ఎస్30 లాంచ్ అయింది.

మోటొరోలా ఎడ్జ్ ఎస్30 స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇందులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

మోటొరోలా ఎడ్జ్ ఎస్30 ధర
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,999 యువాన్లుగా (సుమారు రూ.23,800) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లుగానూ(సుమారు రూ.26,200), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లుగానూ (సుమారు రూ.28,500) ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్లుగానూ(సుమారు రూ.30,900) నిర్ణయించారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

మోటొరోలా ఎడ్జ్ ఎస్30 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10 సపోర్ట్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లుగానూ, బరువు 202 గ్రాములుగానూ ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Embed widget