అన్వేషించండి

Motorola Edge 50 Pro: బెస్ట్ కెమెరా ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చిన మోటొరోలా - రూ.25 వేలలోపే ఎడ్జ్ 50 ప్రో!

Motorola New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో.

Motorola Edge 50 Pro Launched: మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో బుధవారం లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు ఏఐ ఆధారిత ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ముందువైపు ఏకంగా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కంపెనీ అందించడం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఏకంగా మూడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్‌ను కంపెనీ అందిస్తుంది. మూడు కలర్ ఆప్షన్లు, రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 కాగా, టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.27,999కు, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.31,999కు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, మోటొరోలా ఆన్‌లైన్ స్టోర్లలో దీనికి సంబంధించిన సేల్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. బ్లాక్ బ్యూటీ, లూక్స్ లావెండర్, మూన్‌లైట్ పెరల్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఎక్స్‌చేంజ్ బోనస్ కింద అదనంగా రూ.2,000 తగ్గింపు కూడా అందించనున్నారు. అన్నీ కలిపితే రూ.25 వేలలోపే 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ను కొనేయవచ్చు.

మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల 1.5కే పీఓఎల్ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ, పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్‌గానూ ఉంది. హెచ్‌డీఆర్10+ కంటెంట్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. మూడు సంవత్సరాల వరకు ఆపరేటింగ్ సిస్టంలను ఈ ఫోన్ పొందనుంది. అంటే ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్ వరకు లభిస్తుందని అనుకోవచ్చు.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది

ఇక కెమెరాల విషయానికి వస్తే... మోటొరోలా ఎడ్జ్ 50 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. రూ.30 వేలలోపు ధరలో ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ కెమెరాలు ఉన్న ఫోన్ ఇదే అనుకోవచ్చు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌ కాగా, 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ట్ టర్బో ఛార్జింగ్‌లను సపోర్ట్ చేయనుంది. 12 జీబీ ర్యామ్ వేరియంట్ కొనుగోలు చేస్తు 125W ఛార్జర్‌ను, 8 జీబీ ర్యామ్‌ను కొనుగోలు చేస్తే 68W ఛార్జర్‌ను బాక్స్‌లో అందించనున్నరాు. ఐపీ68 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget