అన్వేషించండి

Xiaomi 12T: మనదేశంలో ఎంట్రీ ఇవ్వనున్న 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్లు - ఫొటోలతో పిచ్చెక్కించడమే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ను మనదేశంలో అక్టోబర్ 4వ తేదీన లాంచ్ చేయనుంది.

షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో అక్టోబర్ 4వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మనదేశ కాలమానం ప్రకారం అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు వీటికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ జరగనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ల గురించి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. షావోమీ 12టీ ప్రోలో వెనకవైపు 200 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ1 సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. మోటొరోలా ఎక్స్30 ప్రో, ఎడ్జ్ 30 అల్ట్రాల్లో కూడా ఇదే సెన్సార్‌ను అందించారు. ఈ ఈవెంట్ విషయానికి వస్తే... రెడ్‌మీ ప్యాడ్ ట్యాబ్లెట్,ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

షావోమీ 12టీ ధర 649 యూరోలుగానూ (సుమారు రూ.51,500), షావోమీ 12టీ ప్రో ధర 849 యూరోలుగానూ (సుమారు రూ.67,000) ఉండనుందని గతంలోనే లీకులు వచ్చాయి. అయితే అధికారికంగా ఎంత ఉండనుందో తెలియాలంటే మాత్రం లాంచ్ వరకు ఆగాల్సిందే.

షావోమీ 12టీ ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నట్లు సమాచారం. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. డాల్బీ విజన్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ అందుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై షావోమీ 12టీ ప్రో పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అందించనున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లు ఇందులో ఉండనున్నాయి.

షావోమీ 12టీ స్పెసిఫికేషన్లు (అంచనా)
దీని ఫీచర్లు దాదాపుగా ప్రో వేరియంట్ తరహాలోనే ఉండనున్నాయి. అయితే 200 మెగాపిక్సెల్ సెన్సార్‌కు బదులు 108 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభం అయ్యేది. ఇప్పుడు అమెజాన్ సేల్‌లో రూ.5,000 తగ్గింపును అందించారు. దీంతో రూ.34,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.  షావోమీ 11టీ ప్రోలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లాట్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget