Vivo New Phone: మిడ్‌రేంజ్‌లో వివో మరో 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 12లతో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వివో వై77ఈ టీ1 వెర్షన్‌ను లాంచ్ చేసింది.
వివో వై77ఈ (టీ1 వెర్షన్) చైనాలో లాంచ్ అయింది. ఇందులో 6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇటీవలే వివో వై77ఈ నార్మల్ వెర్షన్ కూడా లాంచ్ అయింది.
వివో వై77ఈ (టీ1 వెర్షన్) ధర
ఈ స్మార్ట్ ఫోన్ వివో చైనా వెబ్‌సైట్లో మొదటిసారి కనిపించింది. దీని ధరను 1,799 యువాన్లుగా (సుమారు రూ.21,000) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. క్రిస్టల్ బ్లాక్, క్రిస్టల్ పౌడర్, సమ్మర్ లిజెనింగ్ టు ది సీ (బ్లూ షేడ్) రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో వై77ఈ (టీ1 వెర్షన్) స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కెమెరా కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్యూర్ బ్లాక్, సెయిలింగ్ బ్లూ రంగుల్లో వివో వీ25 ప్రో లాంచ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,500 తగ్గింపు లభించనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో వీ25 ప్రో పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లను వెనకాల అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4830 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!