DSLR రేంజ్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - పవర్‌ఫుల్ ప్రాసెసర్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ ఎక్స్90 ప్రోను త్వరలో లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.
వివో ఎక్స్80 సిరీస్ ఇటీవలే చైనాలో లాంచ్ అయ్యాయి. ఆ తర్వాత వాటిని మనదేశంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు వాటి తర్వాతి వెర్షన్ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి వివో స్మార్ట్ ఫోన్లను అప్‌గ్రేడ్ చేయడంలో ఎంత ఫాస్ట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది.
వివో ఎక్స్90 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
వివో ఎక్స్90 ప్రోకు కంపెనీ కొన్ని అప్‌గ్రేడ్లు చేయనుంది. వీటిలో అన్నిటికంటే పెద్దది ప్రాసెసర్ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. క్వాల్‌కాం లేటెస్ట్ ప్రాసెసర్ 8 జెన్ 2పై ఈ ఫోన్ పనిచేయనుంది. వివో ఎక్స్ 80 ప్రోలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. తర్వాత క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 లాంచ్ అయింది. దీనికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 మార్కెట్లోకి వచ్చింది.
ఇందులో 1 అంగుళం సైజు ఉన్న కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. పెరిస్కోప్ జూమ్ కెమెరా కూడా ఇందులో ఉండనుంది. 1 అంగుళం సైజున్న కెమెరాతో లాంచ్ అయిన మొదటి ఫోన్ షావోమీ 12ఎస్ అల్ట్రా. ప్రపంచంలో ఒక అంగుళం కెమెరాతో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే.
షావోమీ 12ఎస్ అల్ట్రాలో సోనీ ఐఎంఎక్స్989 సెన్సార్‌ను అందించారు. వివో ఎక్స్90 ప్రోలో కూడా ఇదే సెన్సార్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే... వివో ఎక్స్80 ప్రోలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
వివో వై75ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో ఇటీవలే లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,899 యువాన్లుగా (సుమారు రూ.22,000) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లుగా (సుమారు రూ.25,000) నిర్ణయించారు. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.
ఇందులో 6.58 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో 700 5జీ ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ అవ్వనుంది.12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ అవ్వనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?