Best Smartphones Under 10,000: రూ.10 వేల లోపు ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. ఉత్తమ మొబైల్స్ ఇవే..
మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అందులోనూ రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నారా? ఈ ధరలో ప్రస్తుతం దేశంలో చాలా మంచి మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.
Best Smartphones Under 10000: మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అందులోనూ రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నారా? ఈ ధరలో ప్రస్తుతం దేశంలో చాలా మంచి మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ల ధరను తక్కువగా ఉన్నప్పటికీ.. ఉత్తమ డిజైన్‌తోపాటు మంచి పనితీరు, బ్యాటరీ లైఫ్ తో పనిచేస్తున్నాయి.
Samsung, iQOO, Poco, Realme, Vivo వంటి పెద్ద కంపెనీలు బడ్జెట్ శ్రేణిలో కొత్త మోడళ్లను అందిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు మెరుగైన కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్‌లు కలిగి ఉన్నాయి. ఈ ప్రైజ్ రేంజ్లో ఉన్న కొన్ని ఫోన్లు 5Gకి కూడా సపోర్ట్ చేస్తుండడం విశేషం. ఆ మొబైల్స్ ఏవో చూద్దాం రండి..
Samsung Galaxy M06 5G
ధర: రూ.7,499
తక్కువ ధరకే Samsung Galaxy M06 లాంటి 5G ఫోన్ పొందవచ్చు. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 చిప్ తో పనిచేస్తుంది. 6GB RAM వరకు సామర్థ్యం, కొత్త ఆండ్రాయిడ్ 15 సిస్టమ్‌ను కలిగి ఉంది. 2ఎంపీ లెన్స్‌తో 50ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఒక్కరోజు పాటు నిలిచే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ మొబైల్‌కు Samsung సంస్థ నాలుగు సంవత్సరాలపాటు అప్డేట్స్ అందించనుంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ స్లిమ్ ఫోన్‌ను కేవలం రూ.7,499కే పొందవచ్చు.
iQOO Z10 Lite 5G
ధర: రూ.9,998
తక్కువ ధరలో స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి iQOO Z10 Lite 5G ఉత్తమమైన ఫోన్. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 6300 చిప్‌పై నడుస్తుంది. ఇది రోజువారీ వినియోగంతోపాటు గేమింగ్‌కు ఉత్తమంగా పనిచేస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఎడిటింగ్‌కు సహాయపడే AI సాధనాలతో కూడిన 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది. స్క్రీన్ 6.74 అంగుళాలు. మంచి బ్రైట్‌నెస్‌తోపాటు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్న సాఫ్ట్ మొబైల్ ఇది. నీరు, దుమ్ము, షాక్ ప్రొటెక్షన్ కలిగి ఉంది.
Poco C71
ధర: రూ.6,989
రూ.10 వేలలోపు అతి తక్కువ ధరలో మంచి ఫోన్ అంటే Poco C71 అని చెప్పవచ్చు.ఇందోలో 4GB RAM, 64GB స్టోరేజ్ ఉంటుంది. దీన్ని 2TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 6.88 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, వెనుక 32MP, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీనికున్న 5200mAh బ్యాటరీ లాంగ్ బ్యాకప్‌ను అందిస్తుంది. ఇది కాలింగ్, బ్రౌజింగ్, సోషల్ మీడియా కోసం ఉత్తమంగా పనిచేసే సాధారణ Unisoc ప్రాసెసర్‌పై నడుస్తుంది.
Realme Narzo 80 Lite 4G
ధర: రూ.8,298
Realme Narzo 80 Lite 4G మొబైల్ ఉత్తమైన బ్యాటరీ లైఫ్‌తో అందుబాటులో ఉంది. 6300 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీంతో ఈ మొబైల్‌ను తరచూ ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. ఫోన్ కాల్స్, నోటిఫికేషన్ల కోసం మెరుస్తున్న పల్స్ లైట్‌తో దీన్ని రూపొందించారు. ఈ మొబైల్ సౌండ్ సాధారణం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. water and dust resistanceతో పనిచేస్తుంది.
Vivo Y19e
ధర: రూ.7,999
రెండు వెనుక కెమెరాలు (13MP + 0.08MP)తోపాటు 5MP ఫ్రంట్ కెమెరాతో రూ.7,999కే అందుబాటులో ఉన్న మొబైల్ Vivo Y19e.స్క్రీన్ 6.74 అంగుళాలు. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. 5500mAh బ్యాటరీ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. Unisoc చిప్‌పై పనిచేస్తుంది. కాల్స్, వీడియోలు చూసేందుకు, సాధారణ యాప్‌ల వినియోగానికి ఉత్తమైన సాధనం.
మీరు 5G మొబైల్ కోసం చూస్తుంటే Samsung లేదా iQOO ఎంపిక ఉత్తమం. చౌకైన మొబైల్ కావాలంటే Pocoని ఎంచుకోవచ్చు. స్లిమ్, స్టైలిష్ ఫోన్ కోసం Realme ఉత్తమ ఎంపిక. సాధారణ రోజువారీ ఉపయోగం కోసం Vivo బాగా పనిచేస్తుంది.





















