అన్వేషించండి

New Smartphones in June: జూన్‌లో లాంచ్ అయ్యే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లు ఇవే- పేర్లు, ఫీచర్లు తెలుసుకోండి

New Smartphones in June: జూన్ మొదటి వారంలో మోటోరోలా రేజర్ 60, అల్కాటెల్ V3 సిరీస్ 5G, టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి.

New Smartphones in June: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది చాలా మంచి టైం. జూన్ మొదటి వారం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా  యాక్టివ్‌గా  ఉండబోతోంది. Motorola, Alcatel, Tecno వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు విక్రయానికి సిద్ధమవుతోంది.  ఏ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది. వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

Motorola Razr 60, ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌కు కొత్త నిర్వచనం

Motorolaలో బాగా పాపులర్ అయిన ఫోల్డబుల్ సిరీస్ ఫోన్‌లలో కొత్త వెర్షన్‌ను Razr 60 పేరుతో మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. దీని అమ్మకాలు జూన్ 4, 2025 నుంచి Motorola అధికారిక వెబ్‌సైట్, Flipkartలో ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్‌తోపాటు, పవర్‌ఫుల్‌ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా, అధునాతన డిస్ప్లే టెక్నాలజీని కలిగి ఉంటుంది. Motorola Razr 60 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో Samsung Z Flipకి గట్టి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు.

Alcatel V3 Series 5G అమ్మకాలు జూన్ 2 నుంచి

Alcatel కూడా ఇటీవలే భారతీయ మార్కెట్‌లో తిరిగి వచ్చి తన కొత్త V3 Series 5Gని ప్రారంభించింది. ఈ సిరీస్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి, Alcatel V3 Classic 5G, V3 Pro, V3 Ultra. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జూన్ 2, 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ధర విషయానికొస్తే, ఈ సిరీస్ బడ్జెట్ నుంచి మిడ్-రేంజ్ వినియోగదారుల కోసం రూపొందించారు.  వీటి ప్రారంభ ధర ₹12,999 నుంచి ₹21,999 వరకు ఉంటుంది. చౌక ధరలో 5G అనుభవాన్ని పొందాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

Tecno Pova Curve 5G అమ్మకాలు, ధర

Tecno తాజా స్మార్ట్‌ఫోన్ Pova Curve 5G కూడా ఈ వారంలో అమ్మకాలు ప్రారంభించనుంది. దీని అమ్మకాలు జూన్ 5, 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. వినియోగదారులు దీన్ని Tecno అధికారిక వెబ్‌సైట్, Flipkart నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రత్యేకంగా మెరుగైన పనితీరు, ఎక్కువ బ్యాటరీ లైఫ్, కర్వ్డ్ డిస్ప్లే కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. Tecno Pova Curve 5G ధర ₹15,999 నుంచి ₹16,999 వరకు ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో- లోకేష్‌ సీరియస్- గౌరవంగా ఉండాలని సూచన  
జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో- లోకేష్‌ సీరియస్- గౌరవంగా ఉండాలని సూచన  
Andhra Pradesh Sankranti Holidays 2026: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్- సంక్రాంతి సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్- సంక్రాంతి సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం
ABP Southern Rising Summit 2025: కొన్ని సార్లు నోరుమూసుకుని ఉండాలని రాజకీయం నేర్పింది - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో అన్నామలై సంచల వ్యాఖ్యలు
కొన్ని సార్లు నోరుమూసుకుని ఉండాలని రాజకీయం నేర్పింది - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో అన్నామలై సంచల వ్యాఖ్యలు
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 79 రివ్యూ... మాట నిలబెట్టుకోలేకపోయిన భరణి... కొడుకు చెప్పినా కళ్ళు తెరవని సంజన... కళ్యాణ్‌కు గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ డే 79 రివ్యూ... మాట నిలబెట్టుకోలేకపోయిన భరణి... కొడుకు చెప్పినా కళ్ళు తెరవని సంజన... కళ్యాణ్‌కు గోల్డెన్ ఛాన్స్
Advertisement

వీడియోలు

దూకుడుగా రాజకీయాలు చేసి దారుణంగా దెబ్బతిన్నా: అన్నామలై
ప్రభాస్ లాంటి హీరో ఒక్కడే ఉంటారు: హీరోయిన్ మాళవిక మోహన్
Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో- లోకేష్‌ సీరియస్- గౌరవంగా ఉండాలని సూచన  
జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో- లోకేష్‌ సీరియస్- గౌరవంగా ఉండాలని సూచన  
Andhra Pradesh Sankranti Holidays 2026: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్- సంక్రాంతి సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్- సంక్రాంతి సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం
ABP Southern Rising Summit 2025: కొన్ని సార్లు నోరుమూసుకుని ఉండాలని రాజకీయం నేర్పింది - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో అన్నామలై సంచల వ్యాఖ్యలు
కొన్ని సార్లు నోరుమూసుకుని ఉండాలని రాజకీయం నేర్పింది - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో అన్నామలై సంచల వ్యాఖ్యలు
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 79 రివ్యూ... మాట నిలబెట్టుకోలేకపోయిన భరణి... కొడుకు చెప్పినా కళ్ళు తెరవని సంజన... కళ్యాణ్‌కు గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ డే 79 రివ్యూ... మాట నిలబెట్టుకోలేకపోయిన భరణి... కొడుకు చెప్పినా కళ్ళు తెరవని సంజన... కళ్యాణ్‌కు గోల్డెన్ ఛాన్స్
IBOMMA Ravi: ఐబొమ్మ రవిని పట్టించింది భార్య కాదు - కీలక విషయాలు వెల్లడించిన ACP  శ్రీనివాస్
ఐబొమ్మ రవిని పట్టించింది భార్య కాదు - కీలక విషయాలు వెల్లడించిన ACP శ్రీనివాస్
Tirumala Vaikuntha Dwara Darshan:  ఇంట్లో కూర్చొనే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు పొందండి - ఇదిగో ఈ పద్దతిలో ట్రై చేయండి!
ఇంట్లో కూర్చొనే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు పొందండి - ఇదిగో ఈ పద్దతిలో ట్రై చేయండి!
Andhra Pradesh New districts :  ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
Andhra King Taluka Censor Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రివ్యూ: రామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్... సినిమాలో హైలైట్స్ ఏమిటంటే?
'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రివ్యూ: రామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్... సినిమాలో హైలైట్స్ ఏమిటంటే?
Embed widget