అన్వేషించండి

Tecno Phantom X2: శాంసంగ్ ఎస్22కి పోటీ ఇచ్చే ఫోన్ లాంచ్ చేసిన టెక్నో - ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో కొత్త ఫోన్ లాంచ్ చేసింది.

టెక్నో తన ఫాంటం ఎక్స్ సిరీస్‌లో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే టెక్నో ఫాంటం ఎక్స్2. ఈ ఫోన్ ప్రస్తుతానికి సౌదీ అరేబియాలో మాత్రమే లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించారు. ఒకవేళ ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే వన్‌ప్లస్ 10 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌తో పోటీ పడనుంది.

టెక్నో ఫాంటం ఎక్స్2 ధర
ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 2,699 సౌదీ అరేబియన్ రియాళ్లుగా (సుమారు రూ.59,200) ఉంది. మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది.

టెక్నో ఫాంటం ఎక్స్2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.8 అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. టెక్నో ఫాంటం ఎక్స్2 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ఈ మొబైల్ స్క్రీన్‌కు ప్రొటెక్షన్ లభించనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 5జీ ప్రాసెసర్‌పై టెక్నో ఫాంటం ఎక్స్2 పని చేయనుంది.

8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో అందించారు. మరో 5 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను స్టోరేజ్ ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. వేపర్ చాంజర్ కూలింగ్ సిస్టంతో పాటు సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఈ ఫోన్‌లో అందించారు. 

ఇక కెమెరాల విషయానికి వస్తే... టెక్నో ఫాంటం ఎక్స్2 వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెన్సార్‌లను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by TECNO Mobile (@tecnomobile)

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Embed widget