Samsung Galaxy M34 5G: రూ.17 వేలలోపే శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - సూపర్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ.
Samsung Galaxy M34 5G: శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ వరకు ,ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. ఇవి స్పెషల్ లాంచ్ ధరలు. ఈ ధరలు ఎంత కాలం వరకు అమల్లో ఉంటాయో శాంసంగ్ తెలపలేదు. మిడ్‌నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్ ఫాల్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
జులై 15వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీని కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్, అమెజాన్‌ల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. నాలుగు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్లు, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని శాంసంగ్ అంటోంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ ఈ ఫోన్‌లో అందించింది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్క్రీన్ డెలివర్ చేయనుంది.
5 ఎన్ఎం ఎక్సినోస్ 1280 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ అవుతుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ను డెలివర్ చేయనుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఇక కెమెరా విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో సెన్సార్ కూడా ఉంది. ముందు వైపు ఉన్న 13 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా మంచిగా సెల్ఫీలు తీసుకోవచ్చు.
5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉన్న స్పీకర్లు ఈ ఫోన్‌లో అందించారు.
Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial