అన్వేషించండి

Samsung Galaxy F13: అదిరిపోయే ఫీచర్స్‌తో లో బడ్జెట్‌లో శాంసంగ్ ఎఫ్-సిరీస్ ఫోన్‌ లాంచ్‌

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 డిజైన్ చూస్తే వెనకవైపు మూడు కెమెరాలు దీర్ఘచతురస్రాకారంలో చూడవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

శాంసంగ్ ఎఫ్-సిరీస్ ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. కొత్త శాంసంగ్ ఫోన్ వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉన్న ఎన్నో ఫీచర్స్‌ ఆకట్టుకోనున్నాయి. స్మార్ట్‌ఫోన్ 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో కూడా వస్తుంది. ఇది ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ఎస్‌వోసీపై ఈ ఫోన్ చేయనుంది. మొత్తంమీద శాంసంగ్ ఎఫ్13 అనేది మేలో ఆవిష్కరించిన గేలాక్సీ ఎం13ని పోలి ఉంటుంది. ఇందులో బ్యాటరీ సామర్థ్యంలో మాత్రమే వ్యత్యాసం ఉంది. గేలాక్సీ ఎఫ్‌13 6,000ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. గేలాక్సీ ఎం13 5000ఎమ్‌ఏహెచ్‌ వన్‌తో వచ్చింది. కొత్త గేలాక్సీ ఎం-సిరీస్ ఫోన్ రెడ్‌మీ 10 ప్రైమ్‌, రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్‌, పోకోఎం3 ప్రో 5G వంటి వాటితో పోటీపడుతుంది.

శాంసంగ్ గేలాక్సీ ఎఫ్ 13 ధర, లాంచ్ ఆఫర్లు
శాంసంగ్ గేలాక్సీ ఎఫ్ 13 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 11,999 ఉంది. 4GB RAM + 128GB మోడల్‌ ధర రూ. 12,999. ఇది నైట్‌స్కీ గ్రీన్, సన్‌రైజ్ కాపర్, వాటర్‌ఫాల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. జూన్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్, Samsung.com 
ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో విక్రయిస్తారు. 

శాంసంగ్ గేలాక్సీ ఎఫ్ 13పై లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లకు రూ. 1,000 తక్షణ బ్యాంక్ తగ్గింపు పొందవచ్చు. గూగుల్‌ నెస్ట్‌ మిని, నెస్ట్‌ హబ్‌లో కూడా తగ్గింపు ధరలకు ఫోన్‌ లభిస్తుంది. 

శాంసంగ్ గేలాక్సీ ఎఫ్ 13(Samsung Galaxy F13) స్పెసిఫికేషన్స్
శాంసంగ్ గేలాక్సీ ఎఫ్ 13 Android 12 ద్వారా నడుస్తుంది. డ్యూయల్-సిమ్ (నానో) కలిగి ఉంది. 6.6-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 4GB RAMతోపాటు ఎక్సినోస్ 850 ఎస్‌వోసీతో పని చేస్తుంది. ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగించడం ద్వారా మెమరీని వర్చువల్‌గా విస్తరించుకోవడానికి ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా ఉంది. శాంసంగ్ గేలాక్సీ ఎఫ్ 13 ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తోపాటు 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది.

సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, శాంసంగ్ గేలాక్సీ ఎఫ్ 13 ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఇది 128GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా (1TB వరకు) విస్తరించుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 డిజైన్ ప్రకారం చూస్తే ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీర్ఘచతురస్రాకారంలో ఈ కెమెరా మాడ్యూల్‌ను చూడవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది.

గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం... ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 157 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 587 పాయంట్లను ఈ ఫోన్ సాధించింది.

 

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget