By: ABP Desam | Updated at : 15 Aug 2022 12:59 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
శాంసంగ్ గెలాక్సీ ఏ04 కోర్ ఫీచర్లు లీకయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ04 కోర్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్లో కనిపించింది. SM-A042F మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్ ఉండనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుందని తెలుస్తోంది. దీని ప్రాసెసర్‌కు అందించిన మోడల్ నంబర్ ప్రకారం ఇది మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ అని తెలుస్తోంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 802 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 3,556 పాయింట్లను సాధించింది. గతంలో కూడా శాంసంగ్ గెలాక్సీ ఏ04 కోర్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని ధర కూడా రూ.10 వేలలోపే ఉండనుంది. గతంలో లాంచ్ అయిన గెలాక్సీ ఏ03 కోర్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ04 కోర్‌లో ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లే ఉండనుంది. బ్లాక్, కాపర్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని ఫొటోలు కూడా చూడటానికి గెలాక్సీ ఏ03 కోర్ తరహాలోనే ఉన్నాయి. శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను ఏ03 కోర్‌లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
శాంసంగ్ అత్యంత చవకైన 5జీ ఫోన్ గెలాక్సీ ఎం13 5జీ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా నిర్ణయించారు. ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందుబాటులో ఉంది. 400 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఈ ఫోన్‌లో అందించారు. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ పని చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా బరువు 195 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, 5జీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ సూట్ కూడా ఈ ఫోన్‌లో కంపెనీ అందించనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?
Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?
C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ఫీచర్లు కూడా అదుర్స్
iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?
Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి