News
News
వీడియోలు ఆటలు
X

Realme GT Neo 3T: ఈ రియల్‌మీ ఫోన్‌పై ఏకంగా రూ.12 వేలు తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్!

రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ అందించారు. దీనిపై రూ.12 వేలు తగ్గింపు లభించింది.

FOLLOW US: 
Share:

Realme GT Neo 3T Price Drop: ఫ్లిప్ కార్ట్‌లో రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్‌ను అందించారు. ఏకంగా రూ.12 వేల వరకు తగ్గింపును ఈ ఫోన్‌పై అందించారు. ఇందులో 6.62 అంగుళాల ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 3టీ పని చేయనుంది. 5జీ కనెక్టివిటీ, 80W ఫాస్ట్ చార్జింగ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 12 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది.

రియల్‌మీ జీటీ నియో 3టీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.29,999 కాగా, ఇప్పుడు రూ.19,999కు తగ్గించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 నుంచి రూ.20,999కు తగ్గింది.

ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.33,999 నుంచి రూ.21,999కు తగ్గించారు. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్ కాగా, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 3టీ పని చేయనుంది. డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 194.5 గ్రాములుగా ఉంది.

Published at : 01 May 2023 05:41 PM (IST) Tags: Realme GT Neo 3T Features Realme GT Neo 3T Realme GT Neo 3T Price in India Realme GT Neo 3T Price Drop Realme GT Neo 3T Price Cut

సంబంధిత కథనాలు

Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!

Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!

WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్

Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్

Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

WhatsApp New Feature: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్

WhatsApp New Feature: ఇకపై  స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు