అన్వేషించండి

Realme C30s: మరో ఐదు రోజుల్లో రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ - ధర ఎంత ఉండనుందో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. అదే రియల్‌మీ సీ30ఎస్.

రియల్‌మీ సీ-సిరీస్‌లో కొత్త ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. అదే రియల్‌మీ సీ30ఎస్. దీని డిజైన్, స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. రియల్‌మీ సీ30 తరహాలోనే దీని లుక్, డిజైన్ ఉన్నాయి. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ధర రూ.15 వేలలోపే ఉండనుంది.

రియల్‌మీ సీ30ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. దీనికి కావాల్సిన ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీని కూడా కంపెనీ అధికారిక వెబ్ సైట్లో చూడవచ్చు. ఈ పేజీ ప్రకారం ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది.

పేరు తెలపని ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. బయోమెట్రిక్ యాక్సెస్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కేవలం ఒక్క సెకనులోనే ఈ ఫోన్ అన్‌లాక్ అవుతుందని రియల్‌మీ అంటోంది. 

3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఫోన్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ గ్రిల్ ఇందులో ఉన్నాయి. దీని లుక్ చూడటానికి రియల్‌మీ సీ30 తరహాలోనే ఉంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవవచ్చు. దీని ధర వివరాలు తెలియాల్సి ఉంది.

రియల్‌మీ సీ30 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సోమవారం లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 3 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.8,299గా నిర్ణయించారు. బాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత రియల్‌మీ యూఐ గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 3 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GizNext (@giznext)

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget