![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Realme 10 Pro 5G Sale: రియల్‌మీ 10 ప్రో సేల్ ప్రారంభం - రూ.20 వేలలోనే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ ఫీచర్లు!
రియల్‌మీ 10 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. దీనిపై పలు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
![Realme 10 Pro 5G Sale: రియల్‌మీ 10 ప్రో సేల్ ప్రారంభం - రూ.20 వేలలోనే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ ఫీచర్లు! Realme 10 Pro 5G Sale Started in Flipkart Check Price Offers Compete With OnePlus Nord CE 2 Lite Samsung Galaxy A23 Realme 10 Pro 5G Sale: రియల్‌మీ 10 ప్రో సేల్ ప్రారంభం - రూ.20 వేలలోనే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ ఫీచర్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/16/2e9e03b14a1e823d8af3a886590007bd1671184514019252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రియల్‌మీ ఇటీవలే లాంచ్ చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ 10 ప్రో సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై రియల్‌మీ 10 ప్రో పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ23, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ఫోన్లతో ఈ స్మార్ట్ ఫోన్ పోటీ పడనుంది.
రియల్‌మీ 10 ప్రో 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.19,999గా ఉంది. డార్క్ మేటర్, హైపర్ స్పేస్, నెబ్యులా బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ 10 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ 10 ప్రో 5జీ పని చేయనుంది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. దీని సైడ్ బెజెల్స్ చాలా సన్నగా ఉండటం విశేషం.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను రియల్‌మీ అందించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W సూపర్‌వూక్ చార్జింగ్‌ను రియల్‌మీ 10 ప్రో 5జీ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 50 శాతం చార్జింగ్ కేవలం 20 నిమిషాల్లోనే ఎక్కనుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)