Oppo Reno 10 Series: కెమెరా, గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్!
ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. జులై 13వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది.
ఒప్పో రెనో 10 సిరీస్ 5జీ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 10 5జీ, ఒప్పో రెనో 10 ప్రో 5జీ, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఈ స్మార్ట్ ఫోన్లు చైనాలో మే నెలలోనే లాంచ్ అయ్యాయి.
ఒప్పో రెనో 10 5జీ ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. జులై 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది. ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 10 ప్రో 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.39,999గా నిర్ణయించారు. గ్లోసీ పర్పుల్, సిల్వర్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ ధర
ఇందులో కూడా ఒక్క వేరియంటే లాంచ్ అయింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. గ్లోసీ పర్పుల్, సిల్వర్ గ్రే రంగుల్లోనే ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ కూడా మార్కెట్లోకి వచ్చింది. జులై 13వ తేదీ నుంచి ఒప్పో రెనో 10 ప్రో 5జీ, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.74 అంగుళాల అమోఎల్ఈడీ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ ఎల్టీపీఎస్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93.9 శాతంగా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ స్క్రీన్‌ను ప్రొటెక్ట్ చేయనుంది.
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కూడా అందించారు. దీంతోపాటు మరో 8 జీబీ ర్యామ్‌ని స్టోరేజ్ నుంచి వాడుకోవచ్చు. గేమింగ్ కోసం 3500 స్క్వేర్ వీడియో కూలింగ్ సర్ఫేస్ ఏరియాను ఈ ఫోన్‌లో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ అందించారు.
256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 5జీ, వైఫై 6, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 100 శాతం వరకు ఛార్జింగ్ అవ్వడానికి కేవలం 27 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 1.6 రోజుల పాటు ఛార్జింగ్ రానుంది. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.
ఒప్పో రెనో 10 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఒప్పో రెనో 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93 శాతంగా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌లో అందించారు. వర్చువల్‌గా దాన్ని మరో 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో కూడా వెనకవైపు మూడు కెమెరాలే ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 32 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ఇందులో 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందుబాటులో ఉంది.దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్‌గా ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది. మిగతా ఫీచర్లన్నీ ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ తరహాలోనే ఉన్నాయి.
ఒప్పో రెన్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
దీని సాఫ్ట్‌వేర్, డిస్‌ప్లే ఫీచర్లన్నీ ఒప్పో రెనో 10 ప్రో తరహలోనే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ అందించారు. 64 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌లను వీటిలో అందించారు. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లు కూడా ప్రో మోడల్స్ తరహాలోనే ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 47 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా ఛార్జ్ కానుంది. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.
Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial