అన్వేషించండి

OnePlus Update: ఈ వన్‌ప్లస్ ఫోన్లు వాడుతున్నారా - అయితే ఈ అప్‌డేట్ మీకే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో ఫోన్లకు ఆక్సిజన్ ఓఎస్ 13 ఓపెన్ బీటా అప్‌డేట్‌ను అందించనుంది.

వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ ఫోన్లకు ఆక్సిజన్ఓఎస్ 13 అప్‌డేట్‌ను అందిస్తున్నారు. ఓపెన్ బీటా ప్రోగ్రాంలో ఉన్నవారికి మాత్రమే ఈ అప్‌డేట్ రానుంది. ఎక్స్‌క్లూజివ్‌గా ఇండియా, ఉత్తర అమెరికాల్లో ఆక్సిజన్ ఓఎస్ 13 అప్‌డేట్‌ను వన్‌ప్లస్ అందించనుంది. గతేడాది మార్చిలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆక్సిజన్ఓఎస్ 13 బీటీ అప్‌డేట్‌లో ఎన్నో కొత్త ఫీచర్లు ఉండనున్నాయి.

కొత్త ఆక్వామార్ఫిక్ డిజైన్, హోం స్క్రీన్ వరల్డ్ క్లాక్ విడ్జెట్, క్వాంటం యానిమేషన్ ఇంజిన్ 4.0 వంటి ఫీచర్లు దీంతో లాంచ్ కానున్నాయి. కొత్త ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో అందించనున్నారు. సిస్టం పెర్ఫార్మెన్స్, స్టెబిలిటీ, గేమింగ్‌ను కూడా ఇది ఆప్టిమైజ్ చేయనుంది. 

వన్ ప్లస్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 9 పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో వన్ ప్లస్ అందించింది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్689 సెన్సార్‌ను వన్‌ప్లస్ అందించింది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రీఫాం లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. వార్ప్ చార్జ్ 65టీ ఫాస్ట్ చార్జింగ్‌ను వన్‌ప్లస్ 9 సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఇందులో ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఉన్న స్పీకర్లు ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.81 సెంటీమీటర్లుగానూ, బరువు 183 గ్రాములుగానూ ఉంది.

వన్‌ప్లస్ 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.7 అంగుళాల ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 9 ప్రో పనిచేయనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా వన్‌ప్లస్ 9 ప్రోలో అందించారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget