News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nothing Phone 2 Offers: ముందు బుక్ చేసుకుంటే ఇన్ని ఆఫర్లా - నథింగ్ ఫోన్ 2 ప్రీ-బుకింగ్స్ మొదలు!

నథింగ్ ఫోన్ 2 ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రీ బుక్ చేసుకుంటే ఎన్నో ఆఫర్లు లభించనున్నాయి.

FOLLOW US: 
Share:

Nothing Phone 2 Pre Booking: నథింగ్ రెండో ట్రాన్స్‌పరెంట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2 ప్రీ బుకింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. రూ.2,000 చెల్లించి మీ కోసం ఫోన్‌ను ముందుగా బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా బుక్ చేసుకోవడానికి మీరు ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా బుక్ చేసుకునే వారికి కంపెనీ కొన్ని ప్రత్యేక ఆఫర్‌లు, తగ్గింపులను అందిస్తోంది. ఈ ప్రీ బుకింగ్ పూర్తిగా రీఫండబుల్. అంటే మీరు తర్వాత ఫోన్ వద్దు అనుకుంటే ఆర్డర్‌ను కూడా క్యాన్సిల్ చేయవచ్చు.

ప్రీ-ఆర్డర్ చేసిన వారికి లభించే ప్రయోజనాలు
నథింగ్ ఫోన్ 2ని ప్రీ-ఆర్డర్ చేస్తే, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై ప్రజలకు తగ్గింపు అందిస్తారు. వీరికి కంపెనీ రూ.2,499కి బదులు రూ.1,499కే 45W పవర్ అడాప్టర్‌ను అందజేస్తుంది. నథింగ్ ఫోన్ 2 కేస్ రూ.499కు, స్క్రీన్ ప్రొటెక్టర్ రూ.399కి అందుబాటులో ఉంటాయి. నథింగ్ ఫోన్ 2 కేస్ రెగ్యులర్ ధర రూ.1,299గానూ, నథింగ్ ఫోన్ 2 స్క్రీన్ ప్రొటెక్టర్ అసలు ధర రూ.999గానూ ఉండనుంది.

ఈ ఫోన్‌ను ప్రీ-బుక్ చేసే కస్టమర్లకు నథింగ్ ఇయర్ స్టిక్‌ను రూ.4,250కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.8,499గా ఉంది. ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌తో లభించే ఈ ఆఫర్‌లను పొందడానికి, మీరు జూలై 11వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత ఫోన్‌ను ఆర్డర్ చేయాలి.

నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
నథింగ్ ఫోన్ 2లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌ని అందించనున్నారు. ఇది 120hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్ 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, ఇది మునుపటి కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్‌తో నథింగ్ ఫోన్ 2 పని చేయనుంది.

ఈ సమాచారాన్ని కంపెనీ సీఈవో స్వయంగా ధృవీకరించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మునుపటి వెర్షన్ అయిన నథింగ్ ఫోన్ 1 కంటే పర్యావరణ అనుకూలమైనది. కంపెనీ ఫోన్‌లోని 28 స్టీల్ భాగాలలో 90 శాతం రీసైకిల్ స్టీల్‌ను ఉపయోగించింది. ఫోన్‌లో అల్యూమినియం సైడ్ ఫ్రేమ్‌లు ఉన్నాయి. ఇవి 100 శాతం రీసైకిల్ అయినవే.

నథింగ్ ఫోన్ 2 వినియోగదారులకు మూడు సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లను, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు పొందుతారు. మొబైల్ ఫోన్ కెమెరా, డిజైన్‌కు సంబంధించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు.

నథింగ్ ఫోన్ 2 ధర ఎంత ఉండవచ్చు?
నథింగ్ ఫోన్ (1)ని కంపెనీ రూ. 32,999 ధరతో లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ (2) ధర దాదాపు రూ. 40 వేలు ఉండే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా నథింగ్ ఫోన్ (2)ను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్ 1 ప్రస్తుతం రూ.28,999కే అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొంటే అదనంగా 10 శాతం తగ్గింపు లభించనుంది. దీంతో ఈ ఫోన్ రూ.28,999కే లభించనుంది. ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.

వచ్చే నెలలో లాంచ్ అయ్యే ఫోన్లు
మోటొరోలా రేజర్ 40 సిరీస్ - జూలై 3వ తేదీన లాంచ్ కానుంది
ఐకూ నియో 7 ప్రో - జూలై 4వ తేదీన లాంచ్ కానుంది
వన్‌ప్లస్ నార్డ్ 3 - జూలై 5వ తేదీన లాంచ్ కానుంది
రియల్‌మీ నార్జో 60 సిరీస్ - జూలై 6వ తేదీన లాంచ్ కానుంది
శాంసంగ్ గెలాక్సీ ఎ:34 - జూలై 7వ తేదీన లాంచ్ కానుంది

Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!

Published at : 30 Jun 2023 08:04 PM (IST) Tags: Nothing Phone 2 Nothing Phone 2 Offers Nothing Phone 2 Pre Booking

ఇవి కూడా చూడండి

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!

Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?