Lava Blaze 5G: ఇదీ ఇండియన్ బ్రాండ్ అంటే - దేశంలోనే అత్యంత 5జీ ఫోన్ లాంచ్ చేసిన లావా!
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే లావా బ్లేజ్ 5జీ.
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే కానుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం కూడా ఈ ఫోన్‌లో ఉంది.
లావా బ్లేజ్ 5జీ ధర
దీని ధరను లావా ఇంకా వెల్లడించలేదు. అయితే రూ.10 వేలకు కాస్త అటూఇటుగా ఉంటుందని లావా ప్రెస్ నోట్ ద్వారా తెలిపింది. కాబట్టి దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయి.
లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. వైడ్‌వైన్ ఎల్1 సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. 4 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ద్వారా మరో 3 జీబీని స్టోరేజ్ నుంచి ర్యామ్‌గా మార్చుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... లావా బ్లేజ్ 5జీ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు రెండు ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని ఫీచర్లు చూడటానికి ఇటీవలే లాంచ్ అయిన లావా బ్లేజ్ ప్రో తరహాలో ఉన్నాయి.
లావా బ్లేజ్ ప్రో ఫీచర్లను ఒకసారి చూస్తే... ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ ఐపీఎస్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉండనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మాక్రో, పొర్‌ట్రెయిట్ సెన్సార్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5.0, వైఫై, ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?