By: ABP Desam | Updated at : 28 Sep 2023 03:24 PM (IST)
ఐటెల్ పీ55 5జీ మనదేశంలో లాంచ్ అయింది. ( Image Source : Itel )
ఐటెల్ పీ55 (Itel P55) 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ (Cheapest 5G Phone in India) ఇదే. ఆక్టాకోర్ డైమెన్సిటీ ప్రాసెసర్, వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఏఐ పవర్డ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. ఒక స్టోరేజ్ వేరియంట్, రెండు కలర్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌పై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. కొనుగోలు చేసిన 100 రోజుల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా ఇవ్వనున్నారు.
ఐటెల్ పీ55 ధర (Itel P55 Price in India)
బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఐటెల్ పీ55ను కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.
ఐపీల్ పీ55 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Itel P55 Specifications)
ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. డ్యూయల్ నానో సిమ్ కార్డులను సపోర్ట్ చేసే ఐటెల్ పీ55 ఫోన్‌లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నారు. ఎలాంటి యూజర్ ఇంటర్‌ఫేస్ ఇందులో లేదు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. దీంతోపాటు సెకండరీ ఏఐ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్ పక్కభాగంలో అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఐటెల్ పీ55 సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Introducing the #itel P55, India’s First 5G Smartphone under 10K! Experience the POWER of 5G with lightning-speed performance like never before. Get ready to elevate your mobile experience! Available now at an unbelievable price of just Rs. 9,999. pic.twitter.com/0WXPU2hGa0
— itel India (@itel_india) September 27, 2023
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?
Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>