iPhone 15 Series Leaks: ఐఫోన్ 15 సిరీస్ ధర భారీగా పెంపు - ఏకంగా రూ.లక్ష పైనే!
ఐఫోన్ 15 సిరీస్‌లో అన్ని ఫోన్లలో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుందని తెలుస్తోంది.
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్ ‘ఫార్ అవుట్’ ఈవెంట్లో కంపెనీ లాంచ్ చేసింది. వీటిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే ఐఫోన్ 15 సిరీస్‌కు సంబంధించిన ఫీచర్లు కూడా ఇప్పటికే లీకుల ద్వారా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న లీకుల ప్రకారం ఐఫోన్ 15 సిరీస్‌లో యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉండనుంది. ప్రస్తుతం ప్రో మోడల్స్‌లో అందుబాటులో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ను ఐఫోన్ 15 సిరీస్‌లో కూడా అందించనున్నారు. ఐఫోన్ 15, 15 ప్లస్‌ల్లో ఏ16 బయోనిక్, ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ల్లో ఏ17 బయోనిక్ ప్రాసెసర్లు ఉండనున్నాయి.
ఇప్పుడు వినిపిస్తున్న లీకుల ప్రకారం ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. 6.7 అంగుళాల ప్రో మోడల్ పేరును ‘అల్ట్రా’ అని పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ కంటే ఐఫోన్ 15 సిరీస్ ఖరీదు చాలా ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఏకంగా 1,199 డాలర్ల (సుమారు రూ.95,000) నుంచి దీని ధర ప్రారంభం కానుందని సమాచారం.
ఐఫోన్ 15 మోడల్స్‌లో లైట్‌నింగ్ పోర్టు బదులు యూఎస్‌బీ టైప్-సీ పోర్టును యాపిల్ అందించనుందని వార్తలు వస్తున్నాయి. అన్ని డివైస్‌లకు ఒకే చార్జింగ్ పోర్టు ఉండాలన్న యూరోపియన్ యూనియన్ నిర్ణయం కారణంగా యాపిల్ కూడా పోర్టును మార్చక తప్పడం లేదు.
ప్రస్తుతం కేవలం ప్రో మోడల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ త్వరలో అన్ని ఐఫోన్ మోడళ్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్లలో ఏ17 బయోనిక్ ప్రాసెసర్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లలో ఏ16 బయోనిక్ ప్రాసెసర్ ఉండనుంది.
దీంతోపాటు కెమెరా విషయంలో కూడా యాపిల్ బోలెడన్ని అప్‌గ్రేడ్లు చేయనుందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం రానున్న ఐఫోన్ 15 లైనప్‌లో 8కే వీడయో రికార్డింగ్ ఫీచర్ ఉండనుంది. అయితే ఇవి అల్ట్రా, ప్రో వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయా లేకపోతే అన్ని వేరియంట్లకు వస్తాయా అనేది తెలియరాలేదు. దీంతోపాటు బ్యాటరీ లైఫ్‌ను కూడా మూడు నుంచి నాలుగు గంటలు పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం జరిగిన యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. దీంతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ ఎస్ఈ (రెండో తరం) కూడా భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ 14 ప్లస్ సేల్ త్వరలో మనదేశంలో ప్రారంభం కానుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?