అన్వేషించండి

Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!

ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే హాట్ 12 ప్లే.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది నవంబర్‌లో లాంచ్ అయిన హాట్ 11 ప్లేకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో హోల్ పంచ్  తరహా డిజైన్ అందించారు. వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 12 ప్లే ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. షాంపేన్ గోల్డ్, డేలైట్ గ్రీన్, హారిజన్ బ్లూ, రేసింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మే 30వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ జరగనుంది.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 12 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.82 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్‌ను కూడా అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 480 నిట్స్ కాగా... స్క్రీన్ టు బాడీ రేషియో 90.66గా ఉంది.

6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్ ఉంది. ర్యామ్‌ను ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 3 జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 7 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట. 64 జీబీ స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

4జీ ఎల్టీఈ, జీఎస్ఎం, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, జీ-సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా... బరువు 209 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
iPhone Price Hike: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Vijay Trisha: త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
Embed widget