అన్వేషించండి

Smart Phone Care Tips: హాట్ సమ్మర్‌లో మీ మొబైల్ కూల్‌గా ఉంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు ఇవే!

వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ దెబ్బకు చేతిలో ఉన్న మొబైల్‌ కరెంటు ప్లగ్‌లో పెట్టిన హీటర్‌లా సెగలు కక్కుతోంది. ఫ్రిడ్జ్‌లో పెట్టిన వస్తువులా కూల్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశంలో పెరుగుతున్న వేడిమి, స్మార్ట్‌ఫోన్‌లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
  • ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించి, ఫ్లైట్ మోడ్ వాడటం మంచిది.
  • ఫోన్ కవర్ తొలగించి, ఎండలో వాడటం మానుకోవాలి.
  • ఓవర్ ఛార్జింగ్ వద్దని, చల్లని ప్రదేశంలో ఫోన్ వాడాలి.

Smart Phone Care Tips: దేశవ్యాప్తంగా వేవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఇది 45 డిగ్రీలు దాటి పోవచ్చని కూడా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేడి మరింత పెరిగి అవకాశం లేకపోలేదు. ఈ తీవ్రమైన వేడి కేవం మనుషులకే కాదు, మనం నిరంతరం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. 

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లు కొంత మేర వేడిని తట్టుకోగలవు. కానీ పరిసరాల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవి ఓవర్ హీటింగ్ సమస్యకు గురవుతాయి. ఫోన్ వేడెక్కినప్పుడు దాని పనతీరు నెమ్మదిస్తుంది. కొన్ని సార్లు ఫోన్ హ్యాంగ్ అవుతుంది. లేదా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఈ సమస్యల నుంచి మీ స్మార్ట్ ఫోన్ కాపాడుకోవడానికి కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. 

స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించాలి

చాలా మంది ఫోన్ డిస్‌ప్లే స్పష్టంగా కనిపించాలని ఫుల్ బ్రైట్‌నెస్‌ పెడుతుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌కు చాలా ఎక్కువ పవర్ అవసరం. బ్రైట్‌నెస్‌ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బ్యాటరీ వేగంగా వేడెక్కుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచడం, లేదా ఆటో బ్రైట్‌నెస్‌ మోడ్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం. దీని వల్ల బ్యాటరీపై లోడ్‌ తగ్గి, ఫోన్ చల్లగా ఉంటుంది. 

ఫ్లైట్ మోడ్ యూజ్ చేయాలి

మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా ఫోన్ అవసరం లేనప్పుడు దానిని ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ఫోన్ కంటిన్యూగా నెట్‌వర్క్‌ సిగ్నల్‌ కోసం వెతుకుతూ ఉంటుంది. ముఖ్యంగా సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రక్రియ వల్ల ఇంటర్నల్‌ పార్ట్స్‌ వేడెక్కుతాయి. ఫ్లైట్ మోడ్‌ ఆన్ చేయడం వల్ల నెట్‌వర్క్ కనెక్షన్‌లు తాత్కాలికంగా ఆగిపోతాయి. దీని వల్ల ఫోన్ ఇంటర్నల్ సర్క్యూట్‌లకు విశ్రాంతి దొరుకుతుంది. 

ఫోన్ కవర్‌ను తొలగించడి

ఫోన్ కింద పడినా పాడవకుండా ఉండాలని సెక్యూరిటీగా కవర్లు వేస్తారు. కానీ వేసవిలో  ఈ కవర్లు ఫోన్ నుంచి వచ్చే వేడిని బయటకు పోనివ్వకుండా చేస్తాయి. దీని వల్ల ఫోన్‌లో వెంటిలేషన్ ఉండదు. కాసేపు వాడిని ఫోన్ సెగలు కక్కుతుంది. ఫోన్ చార్జ్‌ చేస్తున్నప్పుడు లేదా ఎక్కువ వాడుతున్నప్పుడు మొబైల్ కవర్‌ను తీసివేస్తే, లోపల వేడి బయటకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. 

ఎండలో ఫోన్ వాడొద్దు 

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండలో ఫోన్ ఉపయోగించొద్దు. ఎండలో ఫోన్ వాడితే రెండు విధాల నష్టం. ఒకటి సూర్యుడి వేడి వల్ల ఫోన్ వేడెక్కడం. రెండోది ఆ ఎండలో స్క్రీన్ కనిపించడం కోసం మనం బ్రైట్‌నెస్‌ పెంచడం వల్ల బ్యాటరీ వేడెక్కడం. ఈ డబుల్ డోస్ వల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడూ నీడలో లేదా చల్లని ప్రదేశంలో ఫోన్ వాడటం మంచిది. 

ఓవర్ ఛార్జింగ్ వద్ద 

చాలా మంది రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి వదిలేస్తారు. ఫోన్ 100 శాతం ఛార్జ్ అయిన తర్వాత కూడా ప్లగ్‌లోనే ఉంచితే అది బ్యాటరీలో అనవసరమైన వేడికి కారణమవుతుంది. ఈ వేడి వల్ల ఫోన్ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. కాబట్టి, ఛార్జింగ్ పూర్తి అయిన వెంటనే ప్లగ్‌ నుంచి తీసేయాలి. 

ఎందుకు ఫోన్‌లు హీటెక్కుతాయి?

స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే లిథియం- అయాన్ బ్యాటరీలు ఉష్ణోగ్రత పట్ల చాలా సున్నితంగా ఉంటాయి. పరిసరాల ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరినప్పుడు ఫోన్ లోపల ఉండే ప్రాసెసర్‌, బ్యాటరీ నిర్వహించే రసాయన చర్యల వల్ల ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ఈ వేడి కేవలం ఫోన్ వేగం తగ్గించడమే కాకుండా, చిప్‌ సెట్‌ను శాశ్వతంగా దెబ్బ తీసే అవకాశం ఉంది.   

Frequently Asked Questions

వేసవిలో స్మార్ట్‌ఫోన్‌లు ఎందుకు వేడెక్కుతాయి?

వేసవిలో పరిసరాల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు ఓవర్‌హీటింగ్ సమస్యకు గురవుతాయి. లిథియం-అయాన్ బ్యాటరీలు ఉష్ణోగ్రత పట్ల సున్నితంగా ఉండటంతో పాటు, ప్రాసెసర్, బ్యాటరీలోని రసాయన చర్యల వల్ల వేడి పెరుగుతుంది.

ఫోన్ వేడెక్కకుండా స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎలా సర్దుబాటు చేయాలి?

ఫోన్ డిస్‌ప్లే స్పష్టత కోసం అధిక బ్రైట్‌నెస్ వాడటం వల్ల బ్యాటరీపై భారం పడి, ఫోన్ వేడెక్కుతుంది. బ్రైట్‌నెస్ ను తక్కువగా ఉంచడం లేదా ఆటో బ్రైట్‌నెస్ మోడ్‌ను ఉపయోగించడం వల్ల బ్యాటరీపై లోడ్ తగ్గి, ఫోన్ చల్లగా ఉంటుంది.

ఫోన్ కవర్ వాడకం వేడిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఫోన్ కవర్లు వేడిని బయటకు పోనివ్వకుండా చేస్తాయి, దీనివల్ల ఫోన్ లోపల వెంటిలేషన్ సరిగా ఉండదు. ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కువగా వాడుతున్నప్పుడు కవర్ తీసివేయడం వల్ల లోపలి వేడి బయటకు వెళ్ళడానికి వీలు కలుగుతుంది.

ఓవర్‌ఛార్జింగ్ వల్ల ఫోన్ వేడెక్కుతుందా?

అవును, ఫోన్ 100% ఛార్జ్ అయిన తర్వాత కూడా ప్లగ్‌లో ఉంచితే అది బ్యాటరీలో అనవసరమైన వేడికి కారణమవుతుంది. దీని వల్ల ఫోన్ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఛార్జింగ్ పూర్తి అయిన వెంటనే ప్లగ్ నుండి తీసివేయాలి.

ఎండలో ఫోన్ వాడకం సురక్షితమేనా?

ఎండలో ఫోన్ వాడకం సురక్షితం కాదు. సూర్యుడి వేడి వల్ల ఫోన్ వేడెక్కడం, స్క్రీన్ కనిపించడం కోసం బ్రైట్‌నెస్ పెంచడం వల్ల బ్యాటరీ వేడెక్కడం జరుగుతుంది. దీనివల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Embed widget