Aadhaar Card: మీ ఆధార్ కార్డుపై ఎవరైనా సిమ్ వాడుతున్నారో లేదో ఇలా చెక్ చేసుకోండి
Aadhaar Card: ఆధార్‌కార్డుపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి. జమ్ముకశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో 6 సిమ్ కార్డులు మాత్రమే అనుమతి ఇస్తారు.

Aadhaar Card:నేటి డిజిటల్ యుగంలో మొబైల్ నంబర్ మన గుర్తింపులో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. బ్యాంకింగ్ నుంచి సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, ప్రభుత్వ సేవలు వరకు ప్రతిచోటా మొబైల్ నంబర్ అవసరం. ఈ పరిస్థితుల్లో నకిలీ సిమ్, సైబర్ మోసాల కేసులు కూడా వేగంగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తికి తెలియకుండానే, వారి ఐడిపై వేరొకరు సిమ్ యాక్టివేట్ చేయించుకుంటారు, ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, మీ ఆధార్ కార్డుపై ఎవరో అపరిచితులు సిమ్ వాడుతున్నారో లేదో తెలుసుకుకోవడం చాలా ముఖ్యం. అసలు ఆ ప్రక్రియ ఏంటీ దాన్ని ఎలా క్రాక్ చేయాలో ఇక్కడ సవివరణంగా తెలుసుకోండి.
ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లకు అనుమతి?
కొత్త టెలికాం నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఆధార్ కార్డుపై గరిష్టంగా 9 సిమ్‌లు మాత్రమే యాక్టివ్‌గా ఉండగలవు. అయితే, జమ్ము కశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి 6 సిమ్‌లకు మాత్రమే పరిమితం చేశారు. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ సిమ్‌లు యాక్టివ్‌గా ఉంటే జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ మీ ఐడిపై మీరు ఉపయోగించని సిమ్ నడుస్తుంటే, దానిని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన బాధ్యత మీదే అవుతుంది. మోసం, దొంగతనం లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఆ సిమ్ ఉపయోగిస్తే, మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, మీ ఐడిపై ఎన్ని, ఏయే సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో ఎలా తనిఖీ చేయాలి?
మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తనిఖీ చేయడానికి, టెలికాం శాఖ 'సంఛార్ సాథీ' TAFCOP పోర్టల్ సదుపాయాన్ని కల్పించింది. దీని ద్వారా మీరు ఇంటి నుంచే నిమిషాల్లో తెలుసుకోవచ్చు.
- దీని కోసం, ముందుగా tafcop.dgtelecom.gov.in లేదా sancharsaathi.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- ఇప్పుడు హోమ్ పేజీలో మీ మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత మీ నంబర్‌కు ఒక OTP వస్తుంది, దానిని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
- లాగిన్ అయిన వెంటనే, మీ ఐడికి అనుసంధానించిన అన్ని మొబైల్ నంబర్‌ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
నకిలీ లేదా తెలియని నంబర్ కనిపిస్తే ఏమి చేయాలి?
జాబితాలో మీకు తెలియని నంబర్ కనిపిస్తే, దాని పక్కన ఉన్న Not My Number లేదా Not Required ఆప్షన్‌పై క్లిక్ చేసి రిపోర్ట్ చేయవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, మీకు ఒక టికెట్ ఐడి లేదా రిఫరెన్స్ నంబర్ వస్తుంది. విచారణ తర్వాత, ఆ నకిలీ సిమ్ క్లోజ్ చేస్తారు. మీ ఐడి నుంచి తీసేస్తారు. దీనికి ఎటువంటి రుసుము వసూలు చేయబోరు. అయితే సిమ్ డీయాక్టివేట్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.





















