Smartphone Buying Guide: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? - ఎంత ర్యామ్ ఉన్న ఫోన్ అయితే బెటర్!
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేటప్పుడు ర్యామ్‌ను కచ్చితంగా చూసుకోవాలి. స్మార్ట్ ఫోన్‌కు ఎంత ర్యామ్ ఉండాలి?
Smartphone Guide: కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు? బ్యాటరీ, కెమెరా, ర్యామ్, లుక్ లేదా మరేదైనా ఉంటుంది. అయితే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు తప్పక చూడవలసిన మూడు విషయాలు మీకు తెలుసా? మంచి ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు మీరు దాని ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, ప్రాసెసర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఇవి స్మార్ట్‌ఫోన్ పని చేసేందుకు ఉపయోగపడతాయి.
మీ ఫోన్‌లో ఎంత జీబీ ర్యామ్ అయితే బెటర్?
కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, వారు ఎంత జీబీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలి అనే ప్రశ్న కూడా చాలా మంది మనసులో వస్తుంది. ర్యామ్ అంటే రాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన భాగం. రీడ్, రైట్ ఫంక్షన్లు ర్యామ్ ద్వారానే నడుస్తాయి. అంటే ర్యామ్... రెగ్యులర్ స్టోరేజ్ కంటే వేగంగా ఉంటుంది. తద్వారా మీరు యాప్‌ల మధ్య వేగంగా స్విచ్ అవ్వవచ్చు.
నేడు స్మార్ట్ ఫోన్ సగటు వినియోగం ప్రకారం మీ స్మార్ట్‌ఫోన్‌లో కనీసం 8 జీబీ లేదా 12 జీబీ ర్యామ్ ఉండాలి. ఎందుకంటే యాప్‌లు, ఫోన్‌ల స్టోరేజ్ కాలక్రమేణా పెరుగుతోంది. ఇంతకుముందు యాప్‌లు, అప్‌డేట్‌లు లైట్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు ఇవన్నీ భారీగా మారుతున్నాయి. దీని కోసం మీకు ఎక్కువ ర్యామ్ అవసరం.
మరోవైపు ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది కనీసం 128 జీబీ ఉండాలి. తద్వారా మీ అన్ని ఫైల్స్, ఫోటోలను సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఫోటోలు లేదా వీడియోలు తీస్తే, మీరు 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్‌ని తీసుకోవాలి. అదే విధంగా గేమింగ్ వినియోగదారులు కనీసం 8 జీబీ లేదా 12 జీబీ RAM ఉన్న ఫోన్‌ను తీసుకోవాలి. తద్వారా వారు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.
ఇంటర్నెట్ సర్ఫింగ్, యూట్యూబ్, వీడియో, పాటలు వంటి వాటికి మాత్రమే స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే బేసిక్ యూజర్లకు 6 లేదా 8 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ ఉత్తమం. అటువంటి స్పెక్స్ ఉన్న ఫోన్ రూ. 15 నుంచి 20 వేల మధ్య సులభంగా వస్తుంది.
మోటొరోలా ఎడ్జ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే మోటొరోలా ఎడ్జ్ 40. ప్రస్తుతానికి యూరోప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ఈ ఫోన్ లాంచ్ లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను అందించారు.
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 599.99 యూరోలుగా (సుమారు రూ.54,000) నిర్ణయించారు. ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ బ్లాక్, నెబ్యులా గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. యూరోప్‌లో దీని సేల్ త్వరలో ప్రారంభం కానుంది. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌ను మోటొరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్‌లో అందించారు.