అన్వేషించండి

Honor Magic V2: 1000 జీబీ స్టోరేజ్, రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ చేసిన హానర్ - ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ హానర్ మ్యాజిక్ వీ2ని లాంచ్ చేసింది.

హానర్ మ్యాజిక్ వీ2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. 2022 జనవరిలో లాంచ్ అయిన హానర్ మ్యాజిక్ వీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో ఇందులో ఒక మోడల్ అందుబాటులో ఉంది. దీనికి మ్యాజిక్ వీ2 అల్టిమేట్ ఎడిషన్ అని పేరు పెట్టారు. దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు 9.9 మిల్లీమీటర్ల మందం ఉండనుంది. బరువు 231 గ్రాములుగా ఉంది.

హానర్ మ్యాజిక్ వీ2 ధర
ఇందులో కేవలం రెండు వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 8,999 యువాన్లుగా (సుమారు రూ.1,03,000) నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్  + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లుగా (సుమారు రూ.1,14,500) ఉంది. బ్లాక్, గోల్డ్, సిల్క్ బ్లాక్, సిల్క్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

మ్యాజిక్ వీ2 అల్టిమేట్ ఎడిషన్‌లో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 16 జీబీ ర్యామ్, 1 టీబీ వేరియంట్‌ స్టోరేజ్‌లో వచ్చిన ఈ వేరియంట్ ధరను 11,999 యువాన్లుగా (సుమారు రూ.1,37,400) నిర్ణయించారు. వెగాన్ లెదర్ బ్లాక్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ చైనాలో జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

హానర్ మ్యాజిక్ వీ2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
హానర్ మ్యాజిక్ వీ2 మొబైల్‌లో 7.92 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ఇన్నర్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 90.4 శాతంగానూ ఉంది. బయటవైపు 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీవో డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఈ రెండు స్క్రీన్లూ స్టైలస్‌ను సపోర్ట్ చేస్తాయి.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు కాగా, దీంతోపాటు 20 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W హానర్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీని సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.3 ఎల్ఈ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ 3.1 - సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

హానర్ ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు దీని మందం కేవలం 0.47 సెంటీమీటర్లు మాత్రమే. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సన్నటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే. అదే ఫోల్డ్ చేసినప్పుడు మాత్రం దీని మందం 0.99 సెంటీమీటర్లుగా ఉండనుంది. ఈ ఫోన్ లెదర్ బ్లాక్ వేరియంట్ బరువు 231 గ్రాములు కాగా, గ్లాస్ ఫినిష్ వేరియంట్ బరువు 237 గ్రాములుగా ఉండనుంది.

Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget