Honor 90: ఇండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ - 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌తో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ మనదేశంలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. అదే హానర్ 90.
హానర్ 90 మనదేశంలో సెప్టెంబర్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత తిరిగి హానర్ భారతదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో 2023 ప్రారంభంలోనే లాంచ్ అయింది. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాను వెనకవైపు అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. మనదేశంలో ఈ ఫోన్ కొత్త స్పెసిఫికేషన్లతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ వివరాలను ప్రముఖ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ వెల్లడించారు. చైనాలో ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 2,499 యువాన్లుగా (సుమారు రూ.28,700) నిర్ణయించారు. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర.
హానర్ 90 ధర (అంచనా)
హానర్ 90 స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో రూ.45 వేల రేంజ్‌లో లాంచ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్లకు ఈ ధర చాలా ఎక్కువ. మరి ఇండియన్ వెర్షన్‌లో మరో ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. గూగుల్ పిక్సెల్ 7ఏ, నథింగ్ ఫోన్ 2, ఐకూ నియో 7 ప్రో, వన్‌ప్లస్ 11ఆర్‌లతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
హానర్ 90 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ప్లస్ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.
ఫోన్ వెనకవైపు 200 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
5జీ, 4జీ, ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా ఈ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చు.
Always keep the light on your phone low to conserve battery #HONOR90 has the highest PWM dimming frequency of 3840Hz which effectively reduces eye strain when lighting is low #ShareYourVibe pic.twitter.com/Q3VDfMwVTR
— HONOR Arabia (@Honorarabia) July 22, 2023
The all-new #HONOR90 is here to shine✨
— HONOR MY (@HonorMalaysia) July 20, 2023
📸200MP Super Sensing Camera + 50MP Super Clear Front Camera
📱Industry’s first 3840Hz PWM Dimming
📥12+256GB/512GB Large Storage
Get yours on 22nd July onwards from RM 1,799* & enjoy rewards worth up to RM 647* 🎁 pic.twitter.com/UBPujzNgbL
Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial