Honor 90 5G Offer: హానర్ 90 5జీపై అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ - రూ.10 వేలకు పైగా తగ్గింపు!
Honor 90 5G Offer: హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ తగ్గింపు అందించారు. ఈ మొబైల్ ప్రస్తుతం రూ.26,999కే అందుబాటులో ఉంది.
![Honor 90 5G Offer: హానర్ 90 5జీపై అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ - రూ.10 వేలకు పైగా తగ్గింపు! Honor 90 5G Gets Huge Discount in Amazon Great Indian Festival Sale Check Price Specifications Features Honor 90 5G Offer: హానర్ 90 5జీపై అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ - రూ.10 వేలకు పైగా తగ్గింపు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/946456b9ee0ba19e07d5d6efa76738171695003614085601_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ (Honor 90 5G) ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీనిపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale) భారీ ఆఫర్‌ను అందించారు. ఏకంగా రూ.11 వేల తగ్గింపును దీనిపై అందించడం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 5జీ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. వెనక వైపు 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ హానర్ 90 5జీకి అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
హానర్ 90 5జీ ఆఫర్ ఏంటి? ప్రస్తుత ధర ఎంత? (Honor 90 5G Offer)
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర (Honor 90 5G Price) లాంచ్ అయినప్పుడు రూ.37,999గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.26,999కే కొనుగోలు చేయవచ్చు.
ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.29,999కే అందుబాటులో ఉంది. ఈ ధరకు రావాలంటే మీరు ఎస్‌బీఐ కార్డులతో ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.
హానర్ 90 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Honor 90 5G Specifications, Features)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హానర్ 90 5జీ స్క్రీన్ రిజల్యూషన్ 1.5కే పిక్సెల్స్‌గా ఉండగా, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, పీక్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్‌గానూ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... హానర్ 90 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.1 ఆపరేటింగ్ సిస్టంపై హానర్ 90 5జీ రన్ కానుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)