అన్వేషించండి

Google Alert: గూగుల్ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌! ఈ పని చేయకపోవడంతోనే 1600 కోట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌- మరి మీరూ!

Google Alert: Gmail లేదా సోషల్ మీడియా వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌. సైబర్ దాడిలో 1600 కోట్ల పాస్‌వర్డ్‌లు, ఇమెయిల్ IDలు లీక్ అయ్యాయి.

Google Alert: మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో Gmail లేదా సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటే ఇది మీ కోసమే. ఇలాంటి వారంతా జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. ఒక పెద్ద సైబర్ దాడి జరిగి ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్ల కంటే ఎక్కువ పాస్‌వర్డ్‌లు, ఇమెయిల్ IDలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది Google, Facebook, Apple Telegram వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌లపై డైరెక్ట్‌ ఎఫెక్ట్ పడేలా జరిగిన అతి పెద్ద దాడిగా చెబుతున్నారు.  

అసురక్షిత సర్వర్ నుంచి డేటా లీక్ 
సున్నితమైన సమాచారం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఓపెన్‌గా యాక్సెస్ చేసే సర్వర్‌ను గుర్తించారు. ఇది సాధారణ వినియోగదారులనే కాకుండా, ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, వ్యాపార ఇమెయిల్‌లు, VPNలు, సోషల్ మీడియా అకౌంట్‌లపై కూడా ప్రభావం చూపింది. అందులో డేటా ప్రమాదంలో పడింది. ఈ ఖాతాల్లోని డేటా ప్రమాదంలో పడిందని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

పాత, కొత్త పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయి
వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ దఫా సైబర్‌ దాడిలో పాత పాస్‌వర్డ్‌లు మాత్రమే కాకుండా, ఇటీవల మార్చిన పాస్‌వర్డ్‌లు కూడా లీక్ అయ్యాయి. పరిశోధకులు 30 కంటే ఎక్కువ లీక్ అయిన డేటాబేస్‌లను విశ్లేషించారు, ఇందులో మొత్తం 350 కోట్ల కంటే ఎక్కువ రికార్డ్‌లు ఉన్నాయి. ఈ డేటా లీక్ 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అన్ని అంశాలు అందులో ఉన్నాయి. అంటే ఇటీవల అప్‌డేట్ చేసిన ఖాతాలు కూడా ప్రమాదంలో పడినట్టు అర్థమవుతోంది. 

Google ఏం చెప్పిందంటే 

ఈ తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, Google వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది.  

ముందుగా, మీ ఇమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా వంటి ముఖ్యమైన ఖాతాల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోండి.

క్యాపిటల్‌ లెటర్స్‌, డిజిట్స్, ప్రత్యేక సింబల్స్‌ ఉన్న స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.

అదనపు భద్రత కోసం రెండు ఫ్యాక్టర్‌ అథెంటికేషన్(2FA)ని ఆన్ చేసి పెట్టుకోవాలని చెప్పింది.

ఫిషింగ్ ,పాస్‌వర్డ్ దొంగతనం నుంచి రక్షించడానికి "పాస్‌కీ" వంటి ఫీచర్లను ఉపయోగించండి.

ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయడం మానుకోండి.

ఏదైనా తెలియని ఇమెయిల్ లేదా సందేశంలో మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు.

ఇలా చేయడం వల్ల మీకు చెందిన ఒక మెయిల్‌ ఖాతా మాత్రమే కాదు, మొత్తం డిజిటల్ లైఫ్‌ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది.  

ఈ డేటా లీక్ Google, Apple, Facebook, Telegram  అనేక కార్పొరేట్ నెట్‌వర్క్‌ల వినియోగదారులు ప్రమాదంలో ఉన్నారు. చాలా మంది ఒకే పాస్‌వర్డ్‌ను అనేక చోట్ల వాడుతుంటారు. అంటే ఒక పాస్‌వర్డ్ లీక్ అయితే, అనేక ఖాతాలు ఒకేసారి హ్యాక్ చేయవచ్చు.

ఇప్పుడే ఈ చర్యలు చేపట్టండి 
మీరు చాలా కాలంగా పాస్‌వర్డ్‌ మార్చుకోకపోతే, ఇక ఆలస్యం చేయకండి. నమ్మదగిన పాస్‌వర్డ్ మేనేజర్ సహాయం తీసుకోండి, మీ అన్ని ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి, సైబర్ మోసాలకు సంబంధించిన విషయాలపై అప్రమత్తంగా ఉండండి. మీ డిజిటల్ భద్రత మీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. వెంటనే చర్య తీసుకోండి.

టాప్ హెడ్ లైన్స్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
Telangana committee probe KCR lands : కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
Title Sponsorship Deal: టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ
టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ
Sai Durgha Tej : ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
Pumpkin Seeds Benefits : 30 రోజులు గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. బరువు తగ్గుతారా?
30 రోజులు గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. బరువు తగ్గుతారా?
Embed widget