Google Pixel 7 Pro: రూ.71 వేల గూగుల్ పిక్సెల్ ఫోన్ రూ.20 వేలలోపే - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్!
రూ. 70 వేలు విలువ చేసే గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.70 వేల విలువైన గూగుల్ పిక్సెల్ 7 ప్రోను రూ.20 వేల ధరకే కొనుగోలు చేయవచ్చు. మీ దగ్గర ఒక మంచి పాత ఫ్లాగ్ షిప్ ఫోన్ ఉండి, మీరు కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే ఈ ఆఫర్ మీకు బెస్ట్.
ఈ ఫోన్ అసలు ధర రూ.84,999 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.70,999కు అందుబాటులో ఉంది. అంటే ఇక్కడ రూ.14 వేల తగ్గింపు అందించారన్న మాట. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 5,000 తగ్గింపు లభించనుంది. అంటే రూ.65,999కు తగ్గనుందన్న మాట.
దీంతోపాటు మీ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.50 వేల వరకు అదనపు తగ్గింపు లభించనుంది. అంటే రూ.15,999కు ఈ ఫోన్ కొనవచ్చన్న మాట. ఎక్స్‌ఛేంజ్ వాల్యూ కొంచెం అటూ ఇటుగా వచ్చినా రూ.20 వేల రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చన్న మాట.
గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 7 ప్రో పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో అందించారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు గూగుల్ పిక్సెల్ 7 తరహాలోనే 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లను గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో అందించారు. ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు ఒప్పో ఏ38 స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ సూపర్ వూక్ ఛార్జింగ్‌ను ఒప్పో ఏ38 సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial