అన్వేషించండి

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Big Billion Days Sale 2023 Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్‌లో మొబైల్స్‌పై టాప్ డీల్స్ ఇవే.

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్ (Flipart Big Billion Days Sale 2023) అక్టోబర్ ప్రథమార్థంలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్లపై ఎన్నో డీల్స్, డిస్కౌంట్లు అందించనుంది. ఒకవేళ మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే కొన్ని డీల్స్‌ను ప్రకటించింది. నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13, పోకో ఎం5, గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్లు డిస్కౌంట్ ధరలను ఇప్పటికే ప్రకటించింది.

ఈ తగ్గింపు ధరలతో పాటు పలు బ్యాంక్ ఆఫర్లు, అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ల ద్వారా ఈ ధరలను ఇంకా తగ్గించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ‘సేల్ ప్రైస్ లైవ్’ సెక్షన్‌ను కూడా యాక్టివ్ చేసింది. ఇందులో లిస్ట్ అయిన కొన్ని ఆఫర్లను ఇప్పుడు చూద్దాం.

1. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 - ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర మనదేశంలో రూ.11,999గా నిర్ణయించారు. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.9,199కే కొనుగోలు చేయవచ్చు.
2. నథింగ్ ఫోన్ 1 - రూ.32,999 ధరతో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1 రూ.23,999కే అందుబాటులో ఉంది.
3. గూగుల్ పిక్సెల్ 7 - రూ.59,999 ధరతో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.36,499కే కొనుగోలు చేయవచ్చు. 
4. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 - రూ.7,299 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్‌ రూ.5,939కే అందుబాటులో ఉండనుంది.
5. వివో వీ29ఈ - గత నెలలోనే రూ.26,999 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.24,999కే కొనుగోలు చేయవచ్చు.
6. రియల్‌మీ సీ55 - రూ.10,999 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై రూ.1,500 తగ్గింపును అందించారు. దీన్ని రూ.9,499కే కొనవచ్చు.
7. ఒప్పో ఏ17కే - ఈ ఫోన్ అసలు ధర రూ.10,499 కాగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.7,999కే అందుబాటులో ఉండనుంది.
8. రెడ్‌మీ నోట్ 12 - ఈ సంవత్సరంలో రూ.17,999 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ లభించనుంది. రూ.10,799కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
9. పోకో ఎం5 - రూ.12,499 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై దాదాపు సగం డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్ రూ.6,999కే అందుబాటులో ఉండనుంది.
10. ఒప్పో రెనో 10 ప్రో 5జీ - దీని ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999 కాగా, రూ.35,999కే కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు మరిన్ని స్మార్ట్ ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలు లభించనున్నాయి. మోటో జీ14ను రూ.8,099కు, మోటో జీ32కి రూ.8,999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే రూ.18,999 ధరతో లాంచ్ అయిన రియల్‌మీ 10 ప్రో 5జీని రూ.15,999కే కొనుగోలు చేయవచ్చు.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget