ఈసారి చైనాలో కాదు ఇండియాలోనే - ఐఫోన్ 14 సిరీస్ గురించి సూపర్ అప్‌డేట్!
యాపిల్ ఐఫోన్ 14 ఉత్పత్తి మనదేశంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఐఫోన్ 14 ప్రొడక్షన్‌ను చైనాలో కాకుండా మనదేశంలో యాపిల్ ప్రారంభించనుందని వార్తలు వస్తున్నాయి. చైనాకు చెందిన ‘క్సీ’ కంపెనీ నిర్వాహకులతో వివాదాలు రావడం, అక్కడ లాక్ డౌన్‌లు నడుస్తుండటంతో అక్కడ ఉత్పత్తి చేయడం కష్టం అయిందని తెలుస్తోంది. దీన్ని మొదట బ్లూమ్స్‌బర్గ్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
ఈ విషయమై భారతదేశంలోని సప్లయర్లతో కూడా యాపిల్ మాట్లాడుతోంది. తైవాన్‌కు చెందిన యాపిల్ సప్లయర్ ఫాక్స్‌కాన్ కూడా చైనా నుంచి విడి భాగాలను భారతదేశానికి తీసుకువచ్చి చెన్నైలోని ప్లాంట్‌లో అసెంబుల్ చేయడానికి అవసరమైన అంశాలను స్టడీ చేసింది.
భారతదేశం నుంచి మొదటి ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌ల ఉత్పత్తి అక్టోబర్ చివరిలో లేదా నవంబర్‌లో పూర్తయ్యే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దీనిపై యాపిల్ ఇంకా స్పందించలేదు. యాపిల్ ఐఫోన్ ఉత్పత్తి చేసే ప్రాంతాలను చైనా నుంచి భారతదేశంతో సహా ఇతర మార్కెట్‌లకు మారుస్తోంది. భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్. ఇక్కడ ఐప్యాడ్ టాబ్లెట్‌లను అసెంబుల్ చేయాలని కూడా యోచిస్తోంది.
భారతదేశం, మెక్సికో, వియత్నాం వంటి దేశాలు అమెరికా బ్రాండ్‌లను సరఫరా చేసే కాంట్రాక్ట్ తయారీదారులకు చాలా ముఖ్యమైనవి. చైనా నుంచి దూరంగా ఉత్పత్తిని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ దేశాల్లో తయారీ కేంద్రాలు పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో కొత్త ఐఫోన్లతో పాటు ట్యాబ్‌లు, మ్యాక్‌లు, ఆపరేటింగ్ సిస్టంలకు కొత్త అప్‌డేట్లు కూడా రానున్నాయి. ఐఫోన్ 14 సిరీస్‌కు సంబంధించిన లీకులు ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ లేటెస్ట్ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో స్టోరేజ్ 256 జీబీ నుంచి ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని ఐఫోన్ 13 ప్రో తరహాలో 128 జీబీ నుంచే స్టోరేజ్ వేరియంట్లు ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో కూడా లాంచ్ కానుందని ఇప్పుడు తెలుస్తోంది.
ప్రముఖ మార్కెట్ రీసెర్చర్ తెలుపుతున్న దాని ప్రకారం ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో ఈ ఫోన్ల ధరను లీక్ చేశారు. ఐఫోన్ 13 మోడల్స్ కంటే 15 శాతం అత్యధికంగా వీటి ధర ఉండనుంది. దీని ప్రకారం ఐఫోన్ 14 సిరీస్‌లో ప్రారంభ వేరియంట్ ధర 1,000 నుంచి 1,050 డాలర్ల మధ్యలో (మనదేశ కరెన్సీలో సుమారు రూ.79,000 నుంచి రూ.83,000 మధ్య) ఉండనుంది.
ఐఫోన్ 14 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా గతంలోనే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఐఫోన్ 14 మ్యాక్స్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... దీని పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో ఉండనుంది.
యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. అయితే యాపిల్ ప్రస్తుతం కొత్త ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఉండనున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!