Instagram livestream :16 ఏళ్లులోపు పిల్లలపై ఇన్‌స్టాగ్రామ్ ఆంక్షలు- తల్లిదండ్రుల పర్మిషన్ ఉంటేనే లైవ్‌కు అనుమతి
Instagram livestream :పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై మరిన్ని ఆంక్షలు విధించింది ఇన్‌స్టాగ్రామ్. 16 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలు లైవ్‌లోకి వచ్చేందుకు వీలు లేకుండా చేసింది.

Instagram livestream :ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తెలియని వాళ్లు ఉండరనే ఆశ్చర్యం కలగదు. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవైఏళ్ల ముసలి వాళ్ల వరకు ఇన్‌స్టా బాగా ఫేమస్ అయిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా క్షణం ఖాలీ ఉన్నా వెంటనే ఇన్‌స్టా రీల్స్ చూస్తుంటారు. దీని వల్ల పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని గ్రహించిన ఇన్‌స్టా కొన్ని మార్పులు చేసింది. ఇకపై 16 ఏళ్ల లోపు చిన్నారు ఇన్‌స్టాలో లైవ్‌లోకి రావడానికి అనుమతించదు.
ఇన్‌స్టాగ్రామ్ సవరించిన మార్పులు ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రావాలంటే పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేసింది. వారి అనుమతి లేనిదే లైవ్ ఆప్షన్ వాడుకోవడానికి వీలు లేకుండా చేసింది. డైరెక్ట్ మెసేజ్‌లలో న్యూడిటీ ఉన్న కంటెంట్ కూడా తల్లిదండ్రుల అనుమతి లేకుండా 16 ఏళ్ల పిల్లలకు కనిపించదు. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.
ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా ఫేస్‌బుక్‌లో కూడా కొన్ని మార్పులు చేసినట్టు మెటా వెల్లడించింది. ఇందులో టీనేజర్లకు రక్షణగా నిలించేందుకు మార్పులు చేసినట్టు మెటా పేర్కొంది.
సోషల్ మీడియా కారణంగా యువత పెడదారి పడుతుందన్న విమర్శలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే మెటా కీలకమైన అప్‌డేట్స్ తీసుకొచ్చింది. వాటికి మరిన్ని అప్‌డేట్స్ చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌లో జరిగే యాక్టివిటీని ట్రాక్ చేసుకునే వీలుగా ఫెసిలిటీస్‌ను సెప్టెంబర్‌లోనే తీసుకొచ్చింది. టీన్ అకౌంట్ ప్రోగ్రామ్ ద్వారా నిరంతరం వాళ్లను గమనించవచ్చు.
ఇప్పుడు తీసుకున్న మార్పులు మొదట యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. వచ్చే నెలల్లో ప్రపంచ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తే తప్ప 16 ఏళ్లలోపు టీనేజర్లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను వాడుకోలేరు. డైరెక్ట్ మెసేజ్‌ల్లో "న్యూడిటీ ఉన్న చిత్రాలు బ్లర్ అవుతాయి. దాన్ని చూసేందుకు ట్రై చేసినా వీలు కాదు. ఆ ఆఫ్షన్ ఆఫ్ చేయడానికి లేదు" దీనికి కూడా తల్లిదండ్రుల అనుమతి అవసరం అని మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
ఫేస్‌బుక్ మెసెంజర్ ప్లాట్‌ఫామ్‌లకు టీన్ అకౌంట్ సెక్యూరిటీని మరింత విస్తరిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు ఇన్‌స్టాలో తీసుకున్న సెక్యూరిటీ మెజర్స్‌ను అందులో ఇంప్లిమెంట్ చేయనున్నారు. టీనేజర్ల అకౌంట్స్‌ను డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా సెట్ చేసి ఉంటుంది. తెలియని వ్యక్తుల నుంచి ప్రైవేట్ మెసేజ్‌లు రావు, సెన్సిబుల్ కంటెంట్‌పై కూడా చాలా ఆంక్షలు ఉంటాయి. ఈ యాప్ కంటిన్యూగా గంటపాటు వినియోగిస్తే అలారమ్స్ వినిపిస్తాయి. ఇక చాలు అని చెప్పే అలారమ్స్ అన్నమాట. రాత్రి వేళ్లల్లో కూడా నోటిఫికేషన్లు రాకుండా చేస్తున్నారు. ఇలా చాలా అప్‌డేట్స్‌ను తీసుకొచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

