Jio Vs Airtel Vs Vi: 28 రోజులు కాకుండా 31 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్ ఇవే - జియో, ఎయిర్‌టెల్, వీఐల్లో ఏది బెస్ట్?
Jio Vs Airtel: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్లలో 31 రోజుల వ్యాలిడిటీని అందించే ప్రీపెయిడ్ ప్లాన్లు కొన్ని ఉన్నాయి. మరి ఈ మూడు నెట్‌వర్క్‌లూ అందించే ప్లాన్లలో ఏది బెస్ట్?
31 Days Validity Plans: ప్రస్తుతం భారతదేశంలో దాదాపు అన్ని టెలికాం కంపెనీల రీఛార్జ్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అదే సమయంలో కంపెనీలు ఒక నెల కాకుండా 28 రోజుల వ్యాలిడిటీని ఎందుకు ఇస్తాయని ప్రజలు బాధపడుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాకుండా టెలికాం కంపెనీలు పూర్తిగా ఒక నెల ప్లాన్లు కూడా ఉన్నాయి. దేశంలో ప్రజలు ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియో, వీఐ టెలికాం కంపెనీలకు కనెక్ట్ అయ్యారు. ఈ ప్లాన్లతో వినియోగదారులు అపరిమిత కాలింగ్‌తో పాటు సూపర్‌ఫాస్ట్ డేటాను పొందుతారు. ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం.
పూర్తి నెల వాలిడిటీ అందించే జియో ప్లాన్
రిలయన్స్ జియో ఒక నెల వాలిడిటీ ప్లాన్ ధర రూ.319గా ఉంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 1.5 జీబీ మొబైల్ డేటాను పొందుతారు. దీని వ్యాలిడిటీ 31 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సర్వీసులకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
పూర్తి నెల వాలిడిటీ అందించే ఎయిర్‌టెల్ ప్లాన్
ఎయిర్‌టెల్ కూడా తన వినియోగదారులకు ఒక నెల ప్లాన్‌ను అందిస్తోంది. అయితే దీని ధర జియో కంటే ఎక్కువ. కంపెనీ ఈ ప్లాన్ ధరను రూ. 379గా నిర్ణయించింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఈ ప్లాన్ ద్వారా ఎంజాయ్ చేయవచ్చు. దీని వ్యాలిడిటీ 31 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో కంపెనీ వింక్ మ్యూజిక్‌తో పాటు అనేక ప్రయోజనాలను ఉచితంగా అందిస్తుంది.
పూర్తి నెల వాలిడిటీ అందించే వొడాఫోన్ ఐడియా ప్లాన్
ఇప్పుడు వొడాఫోన్ ఐడియా ఒక నెల వాలిడిటీ ప్లాన్ గురించి చెప్పాలంటే కంపెనీ ఈ ప్లాన్ ధరను రూ. 218గా నిర్ణయించింది. అయితే ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 3 జీబీ డేటా మాత్రమే అందిస్తారు. ఈ డేటా అయిపోయిన తర్వాత కంపెనీ ఒక ఎంబీ డేటాకు 50 పైసలు ఛార్జ్ చేస్తుంది. అలాగే ఈ ప్లాన్‌లో కంపెనీ వినియోగదారులకు మొత్తం 300 ఎస్ఎంఎస్‌లను ఇస్తుంది. 300 ఎస్ఎంఎస్ తర్వాత కంపెనీ ప్రతి లోకల్ ఎస్ఎంఎస్‌కు ఒక రూపాయిని, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌కు రూ. 1.5ని వసూలు చేస్తుంది. అయితే ఇందులో మీరు ఖచ్చితంగా అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 31 రోజులుగా ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Be it on-field or on-stream, our Paltan is always a pro! 💙
— Reliance Jio (@reliancejio) August 10, 2024
Stream unlimited games on cloud with JioAirFiber.
Upgrade to JioAirFiber today: https://t.co/7nr99rQ0BW#WithLoveFromJio #JioAirFiber #MumbaiMeriJaan #MumbaiIndians@mipaltan pic.twitter.com/M9S0ABH9Oh