News
News
X

iQOO Neo 7 5G: రూ.25 వేలలో మరో బెస్ట్ ఫోన్ వస్తుంది - ఐకూ నియో 7 5జీ ధర, ఫీచర్లు కూడా లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన నియో 7 స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 16వ తేదీన లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది.

FOLLOW US: 
Share:

iQOO Neo 7 5G: ఐకూ నియో 7 5జీ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 16వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. గత సంవత్సరం చైనాలో ఐకూ నియో 7 ఎస్ఈని కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు ఐకూ ఈ ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్‌కు ముందు దీని ధర ఆన్‌లైన్‌లో లీకైంది.

ధర ఎంత ఉండవచ్చు?
ఐకూ నియో 7 5జీ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో రూ. 26,999గా ఉండనుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్విట్టర్ ద్వారా లీక్ చేశారు. అదే సమయంలో దీని టాప్ ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  రూ.30 వేల నుంచి రూ.32 వేల మధ్య ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఫిబ్రవరి 19వ తేదీ లేదా 20వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. మీకు ఈ స్మార్ట్‌ఫోన్‌పై కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా లభించే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్లు కూడా లీక్
ఐకూ నియో 7 5జీలో మీరు ఫుల్‌హెచ్‌డీప్లస్ రిజల్యూషన్‌తో ఉన్న 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. ఇది 120hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌పై పని చేస్తుంది.

ఈ మొబైల్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుతారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా పరంగా చూసుకుంటే మొబైల్ ఫోన్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో మీరు 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాలను పొందుతారు.

అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఐకూ నియో 7 5జీలో కంపెనీ మీకు రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను ఇస్తుంది. అలాగే మీరు మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను కూడా పొందుతారు.

Poco X5 ప్రో విక్రయాలు ప్రారంభం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇటీవల Poco X5 pro 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం నేటి నుండి ప్రారంభమైంది. మీరు దీన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయగలుగుతారు. ఈ మొబైల్ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై కంపెనీ మీకు రూ. 2,000 తగ్గింపును అందిస్తోంది.

View this post on Instagram
 
A post shared by iQOO India (@iqooind)

View this post on Instagram
 
A post shared by iQOO India (@iqooind)

Published at : 13 Feb 2023 09:36 PM (IST) Tags: iQOO iQOO New Phone iQOO Neo 7 5G

సంబంధిత కథనాలు

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్ - డిస్అప్పీయ‌రింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్ష‌న్లు

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్ - డిస్అప్పీయ‌రింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్ష‌న్లు

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు