అన్వేషించండి

iPhone SE 2022: ఐఫోన్ ఎస్ఈ (2022) ర్యామ్ ఎంతో తెలుసా - ఏకంగా ఐఫోన్ 13 రేంజ్‌లో - 5జీ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఇటీవలే కొత్త ఐఫోన్ ఎస్ఈ (2022)ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ర్యామ్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ అందించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ఫోన్‌లో అందించిన ర్యామ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటివరకు వచ్చిన ఏ ఐఫోన్ ర్యామ్ వివరాలను యాపిల్ వెల్లడించలేదు. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ (2020) కంటే ఇందులో 33 శాతం మెరుగ్గా ర్యామ్ సామర్థ్యం ఉంది. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌ను అందించారు. ర్యామ్ కూడా ఎక్కువ కాబట్టి ఈ ఫోన్ మెరుగైన పెర్ఫార్మెన్స్ అందించనుంది. ఐఫోన్ ఎస్ఈ (2022)లో 5జీ కనెక్టివిటీని కూడా అందించారు. వెనకవైపు కెమెరాను మెరుగుపరిచారు.

గతంలో వచ్చిన ఐఫోన్ ఎస్ఈలో 3 జీబీ ర్యామ్‌ను అందించగా... ఇందులో 4 జీబీ ర్యామ్‌ను అందించారు. యాపిల్ మార్చి 8వ తేదీన నిర్వహించిన ఈవెంట్‌కు సంబంధించి ఎక్స్‌కోడ్ 13.3లోని కోడ్ ద్వారా ఈ వివరాలను లీక్ చేశారు. యాపిల్ గతంలో లాంచ్ అయిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13ల్లో కూడా 4 జీబీ ర్యామ్‌నే అందించారు. దీంతోపాటు ఐఫోన్ 13 సిరీస్‌లో అందించిన ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌నే ఇందులో కూడా యాపిల్ అందించింది.

ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ల్లో 6 జీబీ ర్యామ్‌ను అందించారు. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీల్లో 4 జీబీ ర్యామ్ అందించారు. సాధారణంగా యాపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్ మోడళ్ల వివరాలను బయటకు తెలియజేయదు. ఐవోఎస్, యాపిల్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలను తెలియజేసే ఎక్స్‌కోడ్ అనే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఇన్విరాన్‌మెంట్‌ను (ఐడీఈ) యాపిల్ రూపొందించింది. ఇందులో ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ర్యామ్ వివరాలు కూడా ఉంటాయి.

ఐఫోన్ 8 కంటే 1.8 రెట్లు వేగంగా ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. ఇందులో 5జీ సపోర్ట్ కూడా అందించారు. హైస్పీడ్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే బ్యాండ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. ఐఫోన్ ఎస్ఈ (2022)లో మెరుగైన కెమెరాను అందించారు. ఐఫోన్ 13లో ఉన్న కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ హెచ్‌డీఆర్ 4, ఫొటోగ్రఫిక్ స్టైల్స్, డీప్ ఫ్యూజన్, పొర్‌ట్రెయిట్ మోడ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఐఫోన్ ఎస్ఈ (2022) ఒక్కసారి చార్జ్ చేస్తే 15 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ఐఫోన్ ఎస్ఈ 13 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను అందించేది. దానికంటే ఇది రెండు గంటలు ఎక్కువ కావడం విశేషం.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KoahJingJienMickeyMousenTV (@koahjingjienmickeymousentv)

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget