అన్వేషించండి

Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!

Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది.

Infinix Note 40 Pro 5G: ఇన్‌ఫీనిక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఏప్రిల్‌లో లాంచ్ చేయనుంది. అదే ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 సిరీస్. ఈ సిరీస్ కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ సిరీస్ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది.

మాగ్నెటిక్ ఛార్జింగ్‌ అందించే మొదటి ఆండ్రాయిడ్ ఫోన్
ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 20W రివర్స్ మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెరిఫై చేసింది. ఇది మనం ఐఫోన్‌ల్లో చూసే మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సొల్యూషన్ లాగా పని చేస్తుంది. ఈ ఫోన్‌తో మీరు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే ఇతర డివైసెస్‌ను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

వైర్‌లెస్ మాగ్నెటిక్ ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చే మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రో సిరీస్‌నే అని తెలుస్తోంది. సాధారణ వైర్‌లెస్ ఛార్జింగ్, మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ మధ్య తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సాధారణ వైర్‌లెస్, మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ మధ్య తేడా ఏమిటి?
సాధారణ వైర్‌లెస్ ఛార్జింగ్ సమయంలో, వినియోగదారులు తమ ఫోన్‌ను ఛార్జింగ్ ప్యాడ్ లేదా స్టాండ్‌పై ఉంచాలి. ఈ ప్యాడ్ లేదా స్టాండ్‌లో కాయిల్ ఉంటుంది. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ డివైస్ కాయిల్‌తో కనెక్ట్ అయినప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఇది సింపుల్ ప్రాసెస్. అయితే దీనికి డివైస్‌ను ఛార్జింగ్ ప్యాడ్ లేదా స్టాండ్‌లో ఉంచడం అవసరం. ఈ సిస్టమ్‌లోని సమస్య ఏమిటంటే డివైస్‌ను ఛార్జింగ్ ప్యాడ్ నుంచి ఒక అంగుళం కదిలించినా అది ఛార్జింగ్ ఆగిపోతుంది.

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఈ సమస్యకు పరిష్కారం. ఇందులో ఫోన్ లేదా డివైజ్‌ని ఛార్జింగ్ ప్యాడ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. ఈ టెక్నాలజీలో మ్యాగ్నెట్ సాయంతో డివైస్‌ని ఛార్జ్ చేయడానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, పవర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇన్‌ఫీనిక్స్ తన తర్వాతి ఫోన్ సిరీస్‌లో ఈ టెక్నాలజీని ఉపయోగించనుంది.

ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం ఇన్‌ఫీనిక్స్ లాంచ్ చేయనున్న ఈ ఫోన్ సిరీస్‌లో మొత్తం నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు ఉండనున్నాయట. వీటిలో ఇన్‌ఫీనిక్స్ నోట్ 40, ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రో 4జీ, ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ ఉన్నాయి. ఈ నాలుగు ఫోన్‌లు 20W వైర్‌లెస్ ఛార్జింగ్, 100W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నాయని తెలుస్తోంది.

ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే స్మార్ట్ 8 ప్లస్ అనే బడ్జెట్ మొబైల్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌, భారీ బ్యాటరీలను అందించారు. ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఫోన్ వెనకవైపు చూడవచ్చు. మ్యాజిక్ రింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ పని చేయనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
YS Jagan Bandage :  బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Mamata Banerjee Falling Inside Helicopter |మరోసారి గాయపడిన దీదీ..ఏం జరిగిందంటే..! | ABP DesamAvon Defence Systems | శంషాబాద్ లో ఉన్న ఈ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్టప్ గురించి తెలుసా..? | ABP DesamYSRCP Manifesto | YS Jagan | సంక్షేమానికి సంస్కరణలకు మధ్య ఇరుక్కుపోయిన జగన్ | ABP DesamWarangal BRS MP Candidate Sudheer Kumar Interview | వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారు.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
YS Jagan Bandage :  బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?
Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
IPL 2024: ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?
ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?
Embed widget