అన్వేషించండి

WhatsApp Polls: వాట్సాప్‌లో పోల్స్ పెట్డడం ఎలా - ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దాన్ని ఉపయోగించడం ఎలా అంటే?

గ్రూప్ చాటింగ్ కోసం వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను వాట్సాప్ ఇటీవలే తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. 'కమ్యూనిటీస్'తో పాటు పోల్స్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ రూపొందించింది. దీంతో పాటు వాట్సాప్ 32 మంది వ్యక్తులకు వన్-ట్యాప్ వీడియో కాలింగ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అలాగే గ్రూప్స్‌లో సభ్యుల లిమిట్‌ను రెట్టింపు చేసింది.

యాప్‌లోని ఇతర ఫీచర్‌ల మాదిరిగానే WhatsApp పోల్స్‌కు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. అంటే గ్రూప్‌ల్లో షేర్ అయిన పోల్‌ కంటెంట్‌ను చూడటం వాట్సాప్‌కు కూడా కుదరదన్న మాట. ఫేస్‌బుక్ మెసెంజర్, టెలిగ్రామ్‌ల్లో ప్రస్తుతం గ్రూప్ పోల్ ఫీచర్లు ఉన్నాయి.

WhatsApp తాజా వెర్షన్‌లోని వినియోగదారులు ఏదైనా చాట్‌ని తెరవడం ద్వారా పోల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు ఐఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే చాట్ బాక్స్ పక్కన ఉన్న + గుర్తును నొక్కి, పోల్‌పై క్లిక్ చేయండి. అయితే ఆండ్రాయిడ్ వినియోగదారులు చాట్ బాక్స్‌కు సమీపంలో ఉన్న పేపర్‌క్లిప్ చిహ్నంపై నొక్కి, ఆపై పోల్‌పై క్లిక్ చేయాలి.

ఈ పోల్‌లు వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌ల్లో కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత మీరు ప్రశ్న లేదా టాపిక్‌ని టైప్ చేసి, ఇతరులు ఎంచుకోవడానికి ఆప్షన్స్‌ను అందించవచ్చు. ఆప్షన్‌ను ఎంచుకునేటప్పుడు మీరు ఒకదాన్ని ఎంచుకున్నాక కూడా దాన్ని కూడా మరో ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యతలను ఎంచుకునే ఆప్షన్ కూడా పోల్స్‌లో అందించనున్నారు.

త్వరలో వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్!

వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రూప్‌లో మెసేజ్ చేస్తున్న సభ్యుల ప్రొఫైల్ ఫోటో కూడా కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ ఫోటో సభ్యుల పేర్లతో పాటు చూడవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇతర వినియోగదారులు ఈ ఫీచర్ కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే మీరు గ్రూప్ సభ్యుల ఫోటోలను చూడటానికి వారి ప్రొఫైల్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్, పేరుతో పాటు, వారి ఫోటో కూడా గ్రూప్ చాట్‌లో మీకు కనిపిస్తుంది.

వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ఈ ఫీచర్‌ను మొదట WABetainfo లీక్ చేసింది. దీని కథనం ప్రకారం, WhatsApp ఈ ఫీచర్‌ను కొంతమంది బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి iOS కోసం WhatsApp బీటా తాజా వెర్షన్‌ను అమలు చేస్తున్న బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఐఓఎస్ 22.18.0.72 అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటా, వాట్సాప్ గ్రూప్‌లోనే సభ్యుని ఫోటోను చూపించడానికి కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత డెస్క్‌టాప్ బీటా కోసం కూడా వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీని గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ ప్రకటించలేదు. అయితే రాబోయే కాలంలో ఈ ఫీచర్ మిగిలిన వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

iPhone Price Hike: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Shobha Shetty: రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
Rithu Chowdary: తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Embed widget